ఏపీ సీఎం జగన్ రెడ్డి దళితల సొమ్ముతో విగ్రహం పెట్టారు. ఆయన సొంత భజన చేసుకున్నారు. విగ్రహం పెట్టి దళితుల్ని ఉద్దరించేశానని చెప్పుకున్నారు. కానీ తన ప్రసంగంలో ఒక్క సారి కూడా జై భీమ్ అనలేదు. తన పార్టీలోని దళితులకు పదవులు ఇచ్చానని చెప్పుకున్నారు కానీ.. ఆ జాతిని పైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలేమిటో చెప్పలేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు. అందరికీ ఇచ్చే అమ్మఒడి – నాన్న బుడ్డి తప్ప జగన్ రెడ్డి ఏమీ చేయలేదు సరి కదా.. దళిత బిడ్డల విద్యోన్నతి కోసం ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాల్ని దూరం చేశారు. ఇంగ్లిష్ మీడియం పేరుతో అత్యధిక మంది దళితుల పిల్లలు స్కూల్ మానేయడానికి కారణం అయ్యారు.
సబ్ ప్లాన్ నిధుల ఎందుకు మళ్లించారు ?
SC సబ్ ప్లాన్ నిధుల లేమి..కార్పొరేషన్ ల నిధులు జగన్ రెడ్డి వాడేసుకున్నారు. అమ్మఒడి వంటి పథకాల ఖాతాలో కార్పొరేషన్ నిధులు రాసేసుకున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఎంత మంది దళిత యువత స్వయం ఉపాధి కోసం సాయం చేశారో ప్రభుత్వం చెప్పగలదా ?. సబ్ ప్లాన్ నిధులతో అడ్డగోలు ఖర్చులు పెట్టి సొంత ప్రయోజనాలు నెరవేర్చుకున్నారన్నది నిజం కాదా? దళితులు ఆర్థికంగా ఎదకుండా చేసి వారిని పేదరికంలోనే ఉంచితే తప్ప.. ఓటు బ్యాంక్ గా ఉండదని అనుకున్నది నిజం కాదా ?
ఒక్క దళిత మంత్రి, అధికారికి అయినా పవర్ ఉందా ?
పదవులు ఇచ్చామన్న గణాంకాల కన్నా కళ్ల ముందు కనపించేవాటినే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. దళితులకు కొన్ని పదవులు ఇచ్చినా వారికి నిర్ణయాధికారం లేదని హోంమంత్రిని చూస్తే అర్థమైపోతుదంి. దళితులు కీలక పదవులలో ఉన్నా వారికి కనీసం తమ నియోజకవర్గంపై సమీక్ష చేసే అధికారం కూడా ఇవ్వలేదు. దళిత డిప్యూటీ సీఎం నారాయణస్వామికి తన శాఖపై ఒక్క రోజు అయినా ఆఫీస్ వర్క్ చేసే అవకాశం ఇచ్చారా లేనే లేదు. ఏ ఒక్క ఎస్సీ, ఎస్టీ మంత్రికి అలాంటి చాన్స్ ఇవ్వలేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి.
దళితులపై దాడులు చేసినప్పుడు మాట్లాడలేదే !
కోవిడ్ సమయం లో డాక్టర్ సుధాకర్ అంశం, కాకినాడ లో ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, సీతా నగరం శిరో ముండనం కేసు, కడప లో డాక్టర్ అచ్చెన్న మర్డర్ లాంటివి ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టేలా చేశాయి. ఇక రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నియోజక వర్గం కొవ్వూరు లో గల పోలీసులు వేధించారంటూ దళిత యువకుడు బొంతా మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ ను రేపింది. సాక్షాత్తూ హోం మంత్రినే ఆ యువకుడి గ్రామం దొమ్మేరు లోకి రాకుండా మూడు గంటల సేపు నిలిపి వేసారంటే ఆ ఘటన ఎంతటి వివాదాన్ని రేపిందో అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ మాయలే నమ్మలేదు మాస్టారు దళితుల్ని తక్కున అంచనా వేయవద్దు !
తెలంగాణ ఏర్పాటు దగ్గర నుండి దళితులు కెసిఆర్ కు ఆయన పార్టీ కు అండగా నిలబడ్డారు దళితులు. దళిత ముఖ్యమంత్రి హామీ ను పక్కన బెట్టేసినా ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ దళిత ఓటర్లు. తెలంగాణ లోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 19 SC నియోజక వర్గాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో వీటిలో 16 సీట్లను TRS గెలుచుకుంది. అప్పటి విపక్ష కాంగ్రెస్ కేవలం రెండు SC సీట్లకు పరిమితం అయింది. అయితే 2023 ఎన్నికల్లో పరిస్థితి తారుమారు అయింది. ఈ ఎన్నికల్లో BRS గా మారిన TRS 5 సీట్లకు పడిపోతే కాంగ్రెస్ ఏకంగా 14 సీట్లకు ఎగబాకింది. 147 కోట్ల తో నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం దళిత బంధు స్కీం..బడ్జెట్ లో Sc St లకు దాదాపు 52 వేల కోట్ల కేటాయించామన్న ప్రచారం దళితులను నమ్మించలేదు. దళితులు తాము కోరుకునేది అభ్యున్నతి..అధికారం లో వాటా తప్ప విగ్రహాల ద్వారా మెప్పు కోలు పనులు కాదని తమ ఓటు ద్వారా నాయకులకు తెలియ జేశారు. మరోసారి తెలియచేస్తారు.