బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ఈరోజు అధికారికంగా పట్టాలెక్కింది. ‘నాంది’తో విమర్శకుల్ని మెప్పించిన విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. రాధామోహన్ నిర్మాత. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మెహరీన్ కథానాయికగా ఎంపికైంది. మెహరీన్ ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు. ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఈ సినిమాతో మెహరీన్ రీ లాంఛ్ అయినట్టే.
ఇందులో బెల్లంకొండ ఓ డాక్టర్ గా కనిపించబోతున్నాడు. విజయ్ కనకమేడల కథల్లో సామాజిక ఇతివృత్తం ఉంటుంది. ఓ సమస్యని ఆయన తెరపై చూపిస్తుంటారు. ఈసారీ అలాంటి బలమైన సామాజిక అంశంతోనే ఈ స్క్రిప్టు తయారు చేశారని తెలుస్తోంది. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో ఆకట్టుకొన్న మున్నాతో బెల్లంకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. మరోవైపు ‘టైసన్ నాయుడు’ సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మతో ‘రాక్షసుడు 2’ చేయడానికి కూడా అంగీకారం తెలిపాడు.