వైసీపీ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్నేహితుడు.. సోషల్ మీడియాలో బైరెడ్డి గురించి ఎలివేషన్లు ఇస్తూ ఇంటర్యూలు కూడా ఇచ్చే అఖిల్ పహిల్వానే అనే వ్యక్తిని సెక్స్ రాకెట్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పాలు, సెలూన్ల ముసుగులోనే కాకుండా హోటళ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అఖిల్ పహిల్వాన్ మిత్ర బృందం అంతా కలిసి ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
హైక్లాస్ వ్యభిచారం చేయించడంలో వీరు ముందున్నారు. ముందుగా ఫార్చ్యూన్ హోటళ్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం అంతా రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో నడుస్తున్నట్లు బయటపడింది. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా ఉంచి వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అమ్మాయిలందరినీ హోటల్లో పెట్టినట్లు గుర్తించారు. హోటళ్లో 25 రూములు తీసుకొని, వాటిలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది.
అఖిల్ పహిల్వాన్‌ను అదుపులోకి తీసుకొని అతని పూర్వ ట్రాక్ రికార్డ్ పోలీసులు బయటికి తీశారు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు పోలీసులు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులకు కూడా అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్‌తో పాటు ఏడుగుర్ని అరెస్టు చేశారు.