భారత్ దేశ హిందువుల 500 ఏళ్ల కల నెరవేరింది. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకీ అంతా సిద్ధమైంది. 2019లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తరవాత మొదలైన మందిర నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉన్నాయి. మిగతా నిర్మాణ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. నగర శైలిలో దీన్ని నిర్మిస్తున్నారు.
ఈ ఆలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పూర్తిగా దేశ ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే నిర్మిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది. దీనికి కారణం డబ్బుుల లేక కాదు.. హిందువులందరి భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతోనే. దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలకుపైగా విరాళాలు వచ్చాయి. దాదాపుగా ప్రతి కుటుంబం విరాళం ఇచ్చింది. రామ మందిరంలో తమ భాగస్వామ్యం ఉందని ప్రతి ఒక్క కుటుంబం ఫీలయ్యేలా విరాళాల సేకరణ నిర్వహించారు.
అందుకే అయోధ్యలో రామయ్య దర్శనానికి ఒక్క రూపాయి కూడా టిక్కెట్ పెట్టాలని అనుకోవడం లేదు. ప్రసాదం కూడా ఉచితంగానే పంపిణీ చేయనున్నారు. ఆలయ నిర్మాణానికి వెయ్యి కోట్ల వరకూ ఖర్చు అయింది. మిగతా మొత్తంతో భక్తులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అయోధ్యకు ఇక నుంచి రోజుకు లక్ష మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయనున్నారు. అయోధ్య ఇప్పుడు ఓ భారీ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారనుంది.
అయోధ్య రామాలయం పూర్తిగా ప్రజలది. హిందువుల భాగస్వామ్యంతో నిర్మించినది.అందుకే భక్తులు ఇక నుంచి కాశీకి వెళ్లడం తమ జీవితాశయంగా ఎలా పెట్టుకుంటారో… అయోధ్యకు వెళ్లడాన్ని కూడా అలాగే పెట్టుకుంటారని భావిస్తున్నారు.