ఐదు వందల ఏళ్ల క్రితం జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతున్న సందర్భం. హిందువుల ఆరాధ్య దైవానికి మళ్లీ గుడి కట్టించిన మహోన్నత సమయం. ఇప్పుడు దేశమంతా అయోధ్య వైపు చూస్తోంది. ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచంలోని హిందువులంతా జై శ్రీరామ్ అని మనసులో స్మరించుకుంటున్నారు. అయోధ్య రామాయలం స్వప్నం నేడు సాకారం కాబోతోంది.
ప్రాణప్రతిష్ట చేయనున్న ప్రదాని మోదీ
ప్రధాని మోదీ రాములవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇందు కోసం ఆయన అనుష్టానం చేస్తున్నారు. నేల మీదే నిద్రిస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏడు వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపారు. వారంతా ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేపటి నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇస్తారు.
ప్రపంచ ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య
అయోధ్య ఇక నుంచి ప్రపంచంలోని ప్రముఖ అధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. అందు కోసం ప్రత్యేకంగా ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేశారు. రవాణా సౌకర్యాలు, వసతి వంటి వాటిని కూడా పెంచుతున్నారు. తిరుమల తరహాలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన మరో ఆలయంగాగా అయోధ్య నిలువనుంది. హిందువులలు తిరుమల,కాశీ ఎలాంటివో అయోధ్య కూడా అలాగే అవనుంది. తమ జీవితకాలంలో ఒక్క సారి అయినా చూడాలని ప్రతి హిందువు తపించేలా ఆధ్యాత్మిక శోభతో అయోధ్య విరాజిల్లనుంది.
సిమెంట్ ఇసుక లేని నిర్మాణం
అయోధ్య రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించలేదు. కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది శాశ్వతంగా నిలిచిపోవాల్సిన కట్టడం. ఇనుమును ఉపయోగిస్తే తుప్పు పట్టే అవకాశం ఉంది. అందుకే కేవలం రాయిని మాత్రమే ఉపయోగించారు. రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైన రాయిని వినియోగించారు. రాళ్లను ప్రత్యేకమైన గాడిలో కత్తిరించి కలిపారు. ఇలా కలిపేందుకు కూడా కాంక్రీటు వాడలేదు. రామాలయ నిర్మాణానికి వాడిన గులాబి రంగు రాయి అంతా కూడా రాజస్థాన్ లోని భరత్వ్ పూర్ గల బన్సీపహార్ పూర్ నుంచి తెచ్చారు. ఈ గులాబి రాయి జీవిత కాలం చాలా ఎక్కువ. అంతేకాదు ఈ రాయి చాలా దృఢమైంది కూడా.