ఏపీలో పూర్తిగా జీరో స్థాయికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలపడటానికి ఓ అవకాశం షర్మిల రూపంలో లభించింది. వైఎస్ కుటుంబంలో వచ్చిన విబేధాలో తెలంగాణలో షర్మిల సక్సెస్ అవకపోవడమో కారణం ఏదైనా.. వైఎస్ కుమార్తె రూపంలో మరోసారి కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకు రావడానికి ఓ ప్రయత్నం అయితే ప్రారంభమయింది. ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయం పక్కన పెడితే.. ముందు షర్మిల పనితీరులో అంచనాలను అందుకోగలరా అన్న సంశయం చాలా మందిలో ఉంది.
యూపీఏ ప్రభుత్వానికి పెద్ద అండగా ఉన్నది కూడా ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ఎంపీల బలమే. కానీ కాంగ్రెస్ హైకమాండ్ చేతకాని తనంతో మొత్తం నాశనం చేసుకున్నారు. రాష్ట్ర విభజన ఉద్యమాన్ని రాజకీయాలకు వాడుకుని పార్టీని తగలెట్టేసుకున్నారు. అతి కష్టం మీద తెలంగాణలో రేవంత్ రెడ్డి పుణ్యమా అని అధికారంలోకి వచ్చింది. కానీ ఏపీలో జగన్ రెడ్డి పార్టీ మొత్తాన్ని కబ్జా చేసేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే దుకాణం పెట్టుకున్నారు. అప్పుడు వైఎస్ కుటుంబం అంతా .. గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వైఎస్ కుమార్తె వెనక్కి వచ్చి నాన్న ఆశయాల్ని తీరుస్తామని అంటున్నారు.
ఒక్కసారి జనం కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తే ఆ పార్టీ ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరిగే అవకాశముందని ఆ పార్టీ నాయకత్వం ఆశతో ఉంది. పుతున్నది. ముఖ్యంగా విభజన చట్టం గడువు ముగిసిపోతుండటం.. తాము వస్తేనే విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలవుతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో తిరిగి పట్టు సాధించాలనేది కాంగ్రెస్ ప్రయత్నంగా కనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ కంటే ఏపీలోనే కాంగ్రెస్ బలంగా ఉండేది. ఒక్కసారి కాంగ్రెస్ నాయకత్వంపై జనంలో నమ్మకం కల్గిస్తే చాలని ఓటు బ్యాంక్ పెరుగుతుందని నమ్మకంతో ఉన్నారు. షర్మిల ఈ ఆశల్ని ఎంత వరకూ తీరుస్తారో చూడాల్సి ఉంది.
జగన్ రెడ్డిని మొదటి రోజే టార్గెట్ చేయడం.. టీడీపీని కూడా వదలకపోవడ ం ద్వారా తమ దారేంటో చెప్పే ప్రయత్నం చేశారు. వంటనే జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ కు .. షర్మిల ఎంత ప్లస్.. వైసీపీకి ఎంత మైనస్ అనేది ఎన్నికల్లోనే తేలనుంది.