” కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు ”
స్వామి వివేకానంద చెప్పిన ఈ సూక్తి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నారా లోకేష్‌కు పర్ఫెక్ట్గా సూటవుతుతుంది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టడమే లోకేష్‌కు మైనస్ అయింది. ఆయనను రాజకీయాల్లోకి రాక ముందు నుంచే టార్గెట్ చేశారు. తనను.. తను ఇమేజ్ ను ప్రజల్లో ప్రణాళిక ప్రకారం పలుచన చేస్తున్నారని తెలుసుకునే సరికి లోకేష్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ పడినా లేచే కెరటం మాదిరి ఆయన తన ప్రయత్నాలను విరమించలేదు. విజయానికి ఒక్క మెట్టు దూరంలో ఉన్న నారా లోకేష్ పుట్టిన రోజు నేడు.
సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలని తండ్రి మాటలే స్ఫూర్తి
సంక్షోభాల్లో అవకాశాల్ని అంది పుచ్చుకోవాలని చెబుతూంటారు చంద్రబాబునాయుడు. నారా లోకేష్ ఖచ్చితంగా అదే చేసి చూపించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీకి ఓ సంక్షోభం. ఆ సంక్షోభంలో అవకాశాల్ని వెదుక్కున్నారు నారా లోకేష్. 2019లో మంత్రిగా ఉన్నా ఆయన ఓడిపోయారు. పార్టీ ఓడిపోయింది. సోషల్ మీడియాలోను ఆయనను ట్రోల్ చేయని వారు లేరు. అంత ఘోరమైన ఓటమిని చవి చూసినా నారా లోకేష్ కుంగిపోలేదు. నాలుగున్నరేళ్లలో ప్రణాళికాబద్దంగా తనను తాను బిల్డ్ చేసుకున్నారు తన ఇమేజ్ మార్చుకున్నారు. పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడ్నని నమ్మకం కలిగించారు. లోకేష్ తన నాయకత్వ సామర్థ్యాన్ని ఓటమి నుంచి వచ్చిన అవకాశంతో నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత లోకేష్ తండ్రిని మించిన నాయకుడనే విశ్లేషణలు చేయడానికి మీడియా పోటీ పడుతుంది.
కుట్రలు, కుతంత్రాలను చేధించిన లోకేష్
కానీ నారా లోకేష్‌కు ఈ విజయం వారసత్వంగా రాలేదు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొన్నారు. తను రాజకీయాల్లోకి వస్తాడో రాడో తేలియని సమయం నుంచే ఆయనపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. స్టాన్ ఫర్డ్‌లో చదువుకోవడం చేతకానితనమన్నట్లుగా చెప్పారు. నీట్ షేవ్‌తో ఉండటం .. పద్దతిగా మాట్లాడటం పప్పునకు బ్రాండ్ అన్నారు. చివరికి బాడీ షేమింగ్ చేశారు. ఇలాంటి ముద్ర వేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా టీముల్ని నడిపారు. మరో నేత అయితే ఈ మానసిక దాడికి భయపడిపోయేవారు. కానీ అక్కడ ఉన్నది నారా లోకేష్. ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబునాయుడు కుమారుడు. అలాంటి సంక్షోభాన్నీ అవకాశంగా మల్చుకోవాలని డిసైడయ్యారు. దేనికైనా వెరువని తత్వం తనదని నిరూపించుకున్నారు.
కార్యకర్తలకు ఇన్సూరెన్స్, నగదు బదిలీ ఫథకాలు నారా లోకేష్ ఆలోచనలు
నగదు బదిలీ అనే ఆలోచన నారా లోకేష్‌ది. టీడీపీలో ఉన్నప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే టీడీపీ పాలసీల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. 2009లో టీడీపీ నగదు బదిలీ హామీని ఇచ్చింది. మేనిఫెస్టోలో పెట్టి విస్తృతంగా ప్రచారం చేసింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది ఆ పథకం. కానీ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం, లోక్‌సత్తా వంటి పార్టీలు అధికార వ్యతిరేకత ఓట్లు చీల్చడంతో టీడీపీ విజయం దాకా చేరలేకపోయింది. ఇప్పుడు నగదు బదిలీని అనేది ఓ ట్రెండ్. అదే సమయమంలో పార్టీ కార్యకర్తల కోసం నారా లోకేష్ ముందు నుంచీ ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ కల్పించిన మొట్టమొదటి పార్టీ టీడీపీ. ఈ ఆలోచనను వర్కవుట్ చేసింది లోకేష్. ఇప్పుడు ప్రతీ పార్టీ తమ సభ్యులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయంటే.. దానికి పెటేంట్ నారా లోకేష్‌దే.
భవిష్యత్‌లో తిరుగులేని నాయకుడు లోకేష్
పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ ఎంత దూరమైన వెళ్తారు. సొంత కుటుంబంగా చూసుకుంటారు. చదువుకునే సమయంలోనే పార్టీకి తన ఆలోచనల్ని కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చిన లోకేష్ ఇవాళ నాయకుడిగా ఎదిగారు. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి. తన నలభై ఏళ్ల జీవితంలో సగం కాలం ముఖ్యమమంత్రి కుటుంబంలో మిగతా సగం కాలం ప్రతిపక్ష నేత కుటుంబంలో కీలక వ్యక్తి.. ఆయనపై ఎప్పుడూ తప్పు చేశారన్న ఆరోపణలు రాలేదు. గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నా లేకపోయినా తండ్రి, తాతల పేర్లు మాత్రం చెడగొట్టనని ఆయన ధీమాగా చెబుతూంటారు. కానీ తాతలోని ముక్కుసూటితనం, తండ్రిలోని పనితనం కలిసి వారిద్దరినీ మించిన నాయకుడు అవుతారన్న నమ్మకాన్ని పార్టీలో కల్పిస్తున్నారు.
తెలుగు 360 తరపున నారా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు