జగన్ రెడ్డి అధికార మత్తులో ఎక్కడికి దిగిపోతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. తాజాగా ఆయన చెల్లి షర్మిలపైనా నిందలేశారు. తన కోసం పని చేసినప్పుడు తన బాణం ఇప్పుడు తాను అన్యాయం చేశాక.. సొంత రాజకీయం చేసుకుంటూంటే మాత్రం చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అని ముద్ర వేసేశారు. డబ్బులు పడని బటన్లు నొక్కుతున్న జగన్ రెడ్డి ఈ రోజు ఉరవకొండలో ఆసరా పథకం బటన్ నొక్కారు. ఇందు కోసం కోట్లు ప్రజాధనం పెట్టి ప్రకటలు.. బహిరంగసభ ఏర్పాటు చేశారు.కానీ అందులోనూ చంద్రబాబు భజనే చేశారు.
ఎవరిపార్టీలో వారు పోరాడుతూంటే.. అందరూ చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు అన్నట్లుగా మాట్లాడారు.
ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో ఆయన వదిన ఉన్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరింది ఆయన సోదరి షర్మిలనే కాబట్టి.. షర్మిలను ఉద్దేశఇంచి చేసినవేనని స్పష్టమవుతోంది.
పసుపు కమలాల మనుషులు బాబుకు స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. ఇంకా స్టార్ క్యాంపెయినర్‌లు చాలామందే ఉన్నారని ఆక్రోసం వ్యక్తం చేశారు. ఏమీ చేయని ఆయనకు ఇంత మంది స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. కానీ తనకు మాత్రం ఎవరూ లేరన్నారు. నిజానికి జగన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్లతంగా ఆయన చేసిన పనులకు.. ఛీ కొట్టి వెళ్లిపోయారు. వారి రాజకీయం వారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారిపై చంద్రబాబు ముద్ర వేస్తున్నారు. జగన్ రెడ్డి తాను ఎక్కడికి దిగజారిపోయానో అర్థం చేసుకోవడానికి ప్రజాతీర్పు వెలువడాల్సిందే. లేకపోతే అధికార గర్వం దిగే అవకాశం లేదని ఆయన మాటల్ని బట్టి అర్థమైపోతుంది.