సినిమా రివ్యూ రాయడం అంటే సినిమాను బూతద్దంలో పెట్టి చూసి దానిలో ఉన్న తప్పులను వెతికి పట్టుకోవడమే.. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా సరే దానిలో ప్లస్ ల కన్నా మైనస్ లను కూడా ఎక్కువగా చూపించడమే అన్నట్టు కొందరు అభిప్రాయపడుతుంటారు. సినిమా మీద ప్రేక్షకుల్లో ఓ అవగాహన కల్పించడానికి రివ్యూ రైటర్స్ సినిమా రిలీజ్ నాడు రివ్యూలు రాస్తారే తప్ప మరే ఉద్దేశం లేదు. సినిమా చూసే జనాలకు ముందే సినిమా ఫీల్ ను తెలియచేస్తూ వారికి ఓ ముందుమాట తెలియచేయడమే రివ్యూయర్ల పని.
కాని హిట్ అయిన సినిమాకు రివ్యూ మంచిగా రాసినా ఏమీ వాదించని దర్శక నిర్మాతలు ఓ ఫ్లాప్ సినిమాకు సినిమా కష్టమే అని రాస్తే మాత్రం రివ్యూయర్ల మీద యుద్ధానికి దిగుతారు. వారు రివ్యూయర్లను ప్రశ్నించే ముందు వారి సినిమా ప్రేక్షకుల్లో ఏమాత్రం వెళ్లింది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిడి మిడి జ్ఞానంతో సినిమా మీద అవగాహన లేకుండా రివ్యూలు రాస్తున్నట్టు ప్రతి ఒక్క దర్శక నిర్మాత రివ్యూయర్లను అవమానిస్తూనే ఉంటారు. అయినా సరే ప్రేక్షకులకు మంచి సినిమాలో ఎంత విషయం ఉంది అనే కోణంలో రివ్యూలు రాస్తూనే ఉన్నారు.. ఉంటారు రివ్యూ రైటర్స్.
మన దగ్గర రివ్యూ చూసి సినిమాకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తక్కువే అయినా ఓ సినిమా రివ్యూ రేటింగ్ ను బట్టే అది హిట్టా ఫట్టా అనే సంకేతాలు వస్తాయి. అయితే రివ్యూ రైటర్స్ కూడా అంత బ్లైండ్ గా ఏమి సినిమా రేటింగ్ ఇవ్వరు. సినిమా స్కోప్ ను బట్టి ప్రేక్షకుల్లో రిలీజ్ రోజే కాదు స్లోగా ఎక్కే సినిమానైనా ఊహించి సినిమా సినిమాకు ఓ రేటింగ్ ను ఇస్తారు.
రివ్యూయర్ల మీద విరుచుకు పడుతున్న కొంతమంది, సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో తాము ఎంతవరకు పర్ఫెక్ట్ గా తీశాం అన్నది ఆలోచిస్తే మధ్యలో రివ్యూ రైటర్స్ ఏమి చేశారన్న అసలు విషయం అర్ధమవుతుంది. సినిమా బాగుండి రివ్యూలు తప్పుగా రాసినా సరే సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ప్రేక్షకులు రివ్యూలు నమ్మినట్టే నమ్ముతారు కాని రివ్యూలు కేవలం ఓ రచయిత తన కోణంలో ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా నచ్చదా అని చెప్పే ప్రయత్నమే.. అని నమ్మాలని ప్రత్యేకమైన రూల్ ఏమి లేదు. మరి ఇప్పటికైనా రివ్యూ రైటర్స్ మీద దర్శక నిర్మాతలు అపవాదాలు మోపడం మానేసి సినిమా టేకింగ్ మీద దృష్టి పెడితే మంచిది.