గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోటల్లో ఒకటి. కమ్మ సామాజికవర్గానికి తప్ప టీడీపీ తరపున ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తూంటారు. కాంబినేషన్ కుదిరితే చాలు. కాంగ్రెస్, వైసీపీ పదే పదే అభ్యర్థుల్ని మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోతోంది. తాజాగా గుంటూరుకు… వైసీపీ నుంచి చిలుకలూరిపేట నుంచి విడదల రజనీని దిగుమతి చేశారు. అక్కడ ప్యాకప్ చేసుకుని గుంటూరులో రెడీ అయిపోయిన రజనీ.. గల్లీ గల్లీ చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమెకు మెల్లగా పరిస్థితులు అర్థమవుతున్నాయన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
గుంటూరులో ఈ సారి కొత్త అభ్యర్థులు పోటీ పడతబోతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి ఏసురత్నం నిలబడితే.. టీడీపీ నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. గెలిచిన గిరి తనకు ఉన్న జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ లేదు. గుంటూరు వెస్ట్ టీడీపీ కంచుకోట కాబట్టి.. కమ్మ సామాజికవర్గం ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ గుంటూరు వెస్ట్ లో అన్ని రకాల సామాజికవర్గాల జనాభా ఉంటుంది. ఎవరూ లీడ్ కాదు. మరీ గెలుపోటములను శాసించే పొజిషన్ లో ఎవరూ లేరు.
అక్కడ ఉన్న సామాజికవర్గాల ప్రకారం చూసినా.. . ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా… విడదల రజనీకి కష్టకాలమేనని వైసీపీ నేతలే చెబుతున్నారు. గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందిన వారు.ఆమె భర్త రజక వర్గానికి చెందిన వారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంతమాత్రం. పైగా గుంటూరు పశ్చిమ టీడీపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పాతిక వేల ఓట్ల వరకూ చీల్చినప్పటికీ.. టీడీపీ ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో పోటి చేస్తున్నాయి కాబట్టి… పలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే మంత్రి కాబట్టి బుజ్జగంచాడనికి ఇంచార్జ్ గా నియమించారని.. కానీ చివరికి ఆమెకూ టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది.
రాజకీయాల్లోకి రావడానికి…. మంత్రి పదవి పొందడానికి తన టాలెంట్ చూపించిన విడదల రజనీ.. తన కెరీర్ ను మరింత పొడిగించుకోవాలంటే.. నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందాలన్న విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. ఇప్పుడు ఆమెకు నియోజకవర్గం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ టిక్కెట్ వచ్చినా.. ఆమెకు ఖర్చు మాత్రమే మిగులుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. .