వైసీపీలో జగన్ రెడ్డి మాటల్ని వినే నేతలు తగ్గిపోయారు. తాజాగా పర్చూరుకు కొత్త అభ్యర్థిని జగన్ రెడ్డి వెదుక్కోక తప్పని పరిస్థితి ేర్పడింది. చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి కృష్ణమోహన్ తన అనుచరులకు చెప్పారు. చీరాలలో కరణం వెంకటేష్ కే టిక్కెట్ అని ఆయనను మార్చేందుకు జగన్ ఇష్టపడకపోవడంతో అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించిన ఆయన.. చీరాలలోనే పోటీ చేయబోతున్నానని ఏదైనా పార్టీ తరపునా లేదా ఇండిపెండెంట్ గానా అన్నది త్వరలో డిసైడ్ చేస్తానని అనుచరులకు చెప్పారు.
చీరాలో బలమైన నేత అయిన ఆమంచిని జగన్ పర్చూరుకు పంపారు. అక్కడ గెలిచే అవకాశం లేదని మొదటి నుంచి స్పష్టత ఉంది. అందుకే చీరాలలో తన అనుచరులతో ఎప్పుడూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చివరికి అయినా తనకు టిక్కెట్ కేటాయిస్తారనుకున్నారు. కానీ జగన్ కు అలాంటి ఆలోచన లేకపోవడతో ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. ఓ సారి కాంగ్రెస్.. మరోసారి ఇండిపెండెంట్ గా ఆమంచి చీరాల నుంచి గెలిచారు.
ఆయన సోదరుడు స్వాములు ఇప్పటికే జనసేనలో చేరారు. ఆమంచి జనసేనలో చేరితే చీరాల టిక్కెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఆయన కూడా అదే ఉద్దేశంతో స్వముల్ని పార్టీలోకి పంపారని అంటున్నారు. వచ్చే పది రోజుల్లో ప్రకాశం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందులో ఆమంచి కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.