బాచిన కృష్ణ చైతన్య. ఈయనను జగన్ రెడ్డి తనకు సన్నిహితుడని చెబుతారు. అలాంటిది ఇప్పుడు ఆయన వ్యాపారాలపై దృష్టి సారించారు. అధికారులతో దాడులు చేయిస్తున్నారు. దీనికి కారణం కృష్ణ చైతన్యకు నిన్నటి వకూ ఉన్న అద్దంకి ఇంచార్జు పదవిని తీసేసి.. హనిమిరెడ్డి అనే పెదకూరపాడు వ్యాపారస్తుడికి టిక్కెట్ ఇచ్చారు. దాన్ని బాచిన కృష్ణచైతన్య వ్యతిరేకించారు. అందుకే దాడులు ప్రారంభించారు.
ఐదేళ్ల పాటు అద్దంకి నియోజకవర్గంలో ఖర్చులు పెట్టుకుని కృష్ణచైతన్య పార్టీని నడిపించారు. తీరా ఇప్పుడు ఆయనును కాదని ఓ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు.
అది వ్యతిరేకించినందుకు దాడులు ప్రారంభించారు. ఇలాంటి పాము బుద్ది ఉన్న నేత పార్టీలో ఇక ఇమడలేమని టీడీపీలో చేరేందుకు బాచిన తండ్రీ కొడుకులు రెడీ అయిపోయారు.
బాచిన చెంచు గరటయ్య.. మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడే కృష్ణ చైతన్య. కమ్మ సామాజికవర్గానికి చెందిన వీరు.. జగన్కు విధేయంగా ఉన్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. రెండు, మూడు రోజుల్లో చంద్రబాబును కలిసి టీడీపీలోచేరనున్నారు. జగన్ రెడ్డి ఎన్ని వేధింపులకు పాల్పడినా తగ్గేది లేదంటున్నారు.