కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చిందంటూ జగన్ రెడ్డి చేసిన విమర్శలను ఆయన సోదరి షర్మిల తీవ్రంగా తప్పు పట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందుప ెట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని,నా కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని మండిపడ్డారు. దేవుడే గుణపాఠం చెప్తారట నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే అది జగన్ వల్లేనన్నారు. ఇవ్వాళ YSR కుటుంభం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనేనని.. దీనికి సాక్ష్యం దేవునితో పాటు నా తల్లి,వైఎస్సార్ భార్య విజయమ్మ అని షర్మిల స్పష్టం చేశారు.
దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబమన్నారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడితే.. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారని.. ఇవ్వాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారని షర్మిల ప్రశఅనించార. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగామన్నారు. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం.. వాళ్ళను గెలిపించాం.. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారని గుర్తు చేశారు. నా ఇంటిని,పిల్లలకు పక్కన పెట్టీ…ఎండనక,వాన అనక రోడ్ల మీదనే ఉన్నానని.. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశానన్నారు. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశానని.. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డానని గుర్తు చేశారు.
ఎందుకు అని అడగకుండా,స్వలాభం చూడకుండా,నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశానని.. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగానన్నారు. మిమ్మల్ని గెలిపించా… ముఖ్యమంత్రి అయ్యారు… ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషి,మారిపోయాడని మండిపడ్డారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను కానీ.. మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు,ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని.. కాని అది కూడా చేయలేదన్నారు. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలు గా మారారన్నారు.
షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ రెడ్డి నిజస్వరూపం మెల్లగా కుటుంబమే ప్రజల ముందు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకుని ఆ నిందను ఇతరులపై వేయడానికి వెనుకాడని జగన్ రెడ్డి.. చివరికి చెల్లి చేతిలో ఘోరంగా ఛీ కొట్టించుకునే పరిస్థితికి వచ్చారు.