రవితేజ ఖాతాలో మరో సినిమా చేరింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో రవితేజ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే దర్శకుడు, ఇతర వివరాల్ని వెల్లడించలేదు. ఈరోజు రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సితార కొత్త సినిమా కబురు వినిపించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఇది 29వ సినిమా కావడం విశేషం. సితార సంస్థలో చాలామంది కొత్త దర్శకులు, సీనియర్లు అడ్వాన్సులు తీసుకొన్నారు. మరి వాళ్లలో రవితేజని డైరెక్ట్ చేసేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
మరోవైపు డీజే టిల్లు సీక్వెల్ గా రాబోతున్న టిల్లు స్వ్కేర్ రిలీజ్ డేట్ ని సితార సంస్థ ఫిక్స్ చేసింది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. నిజానికి ఫిబ్రవరి 9న ఈ సినిమా రావాల్సివుంది. సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న ఈగల్ కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని ఫిల్మ్ ఛాంబర్ మాట ఇచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి 9 పోటీ నుంచి.. టిల్లు పక్కకు వెళ్లాడు. ఇప్పుడు మార్చి 29న డేట్ ఫిక్స్ చేసుకొన్నాడు.