మిచౌంగ్ తుపాను వల్ల కనీసం 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని .. ఓ ప్రాంతానికి వెళ్లి ప్రత్యేకంగా స్టేజ్ వేయించుకుని మర పరిశీలించారు జగన్ రెడ్డి. మరి ఏమైనా ఎకరానికి ఓ పది వేలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను డిమాండ్ చేసినట్లుగా ఓ ఇరవై వేలో ప్రకటించారా అంటే… అదేం లేదు. అందరికీ పరిహారం ఖచ్చితంగా వస్తుందని.. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎప్పుడంటే జనవరిలోనే ఇస్తామని చెప్పారు. ఇన్ పుట్ సబ్సిడీ వేరు.. పరిహారం వేరు.
కేంద్రం మిచౌంగ్ తుపాను బాధితులకు ఆరేడు వందల కోట్ల రూపాయలను రాష్ట్రానికి .. విపత్తు నిది కింద ఇచ్చింది. కనీసం వాటిని కూడా పంపిణీ చేయలేదు. జనవరి మాసం పూర్తవుతోంది. కానీ మిచౌంగ్ తుపాను పరిహారం గురించి చెప్పడం లేదు. ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన ఆసరా పథకం నిధులకు బటన్ రెండు రోజుల కింద నొక్కారు. కానీ ఎవరికీ పడలేదు. వారం రోజుల పాటు పడతాయని నమ్మిస్తున్నారు. తర్వాత చేయూత అనే పథకానికి బటన్ నొక్కాల్సి ఉంది. అది అక్టోబర్ లో నొక్కాలి. కానీ ఎన్నికలకు ముందు నొక్కాలని ఆపేశారు.
ఇప్పుడు వచ్చే నెల నొక్కుతామని అంటున్నారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి అమ్మఒడి పథకం జనవరిలో ఉండాలి. ఇప్పటికి నాలుగు సార్లు మాత్రమే ఇచ్చారు . ఈ జనవరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సింది … జూన్ కు మార్చారు. అంటే ఈ ప్రభుత్వ పదవీ కాలం ముగిసిపోతుంది. అంటే ఒకసారి ఎగ్గొట్టినట్లే. కానీ అప్పులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రతీ వారం వేల కోట్లు అప్పులు తెస్తూనే ఉన్నారు. అస్మదీయులైన కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లింపులు చేస్తూనే ఉన్నారు.