మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇది వరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ‘కన్నప్ప’ సెట్లో అడుగు పెట్టడానికి ప్రభాస్ కూడా రెడీ అయ్యాడు. తన కాల్షీట్లు ఖరారు చేశాడు. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలను ప్రభాస్ ‘కన్నప్ప’ కోసం కేటాయించాడు. న్యూజీలాండ్ లో ‘కన్నప్ప’ షూటింగ్ కొంత వరకూ జరిగింది. బహుశా.. ప్రభాస్ సన్నివేశాల్నీ అక్కడే తెరకెక్కిస్తారని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడని టాక్. ఈ విషయమై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వాల్సివుంది. నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్… ఇలా చాలామంది స్టార్లు ఈ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్లింకా ‘కన్నప్ప’ సెట్లో అడుగు పెట్టలేదు. విష్ణు కెరీర్లోనే అత్యంత భారీగా ఏకంగా రూ.100 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతర్జాతీయ సాంకుతిక నిపుణులు ఈ చిత్రంలో పని చేస్తున్నారు.