గాలి జనార్ధన్ రెడ్డికి, జగన్ కు ఉన్న సంబంధం అందరికీ తెలుసు. కోర్టుల్లో నాకు గాలి జనార్తన్ రెడ్డి తెలియదని జగన్ రెడ్డి అబద్దాలు చెప్పినా నిజమేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికలకు టికెట్ల కేటాయించే విషయంలో కూడా గాలి జనార్ధన్ రెడ్డి సిఫారసుకు జగన్ ప్రాధాన్యమిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్ల వైసీపీ కేండెట్ల ఎంపిక గాలి , ఆయన అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతుందంటున్నారు. మ
ముఖ్యంగా కర్ణాటక బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు, ఇతర లావాదేవీలతో వైసీపీ అధినేత జగన్ వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటున్నారు. ఆర్థికంగా కూడా అక్కడి నుంచి సహకారం పుష్కలంగా ఉండడంతో వైసీపీ బాస్ .. లోకల్ , నాన్ లోకల్ అన్న తేడా లేకుండా .. ఎవరెవరినో తీసుకొచ్చి అభ్యర్ధులుగా ప్రకటించేస్తున్నారంట. కర్ణాటక కోటాలో ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలకు టికెట్లు ఖరారయ్యాయి. రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, మడకశిర వైసిపి అభ్యర్థి ఈర లక్కప్ప, హిందూపురం వైసీసీ ఇంచార్జి దీపికలకు అక్కడి పెద్దల ఆశీస్సులతోనే పోటీ చేసే అవకాశం లభించిందంట.
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రరెడ్డి కూడా 2009 నుంచి కర్ణాటక పెద్దలతో ఉన్న సంబంధాలతోనే టికెట్ దక్కించుకుంటూ వచ్చారంటారు. ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు కాపురామచంద్ర రెడ్డికి సంబంధాలు చెడిపోవడంతో వైసీపీ టికెట్ దక్కకుండా పోయింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డికి వ్యాపార సంబంధాలు ఉండేవి. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో .. గాలి ఎఫెక్ట్‌తోనే కాపుకి టికెట్ దక్కకుడా పోయిందన్న టాక్ వినిపిస్తోంది.
హిందూపురం వైసీసీ ఇంచార్జిగా వచ్చిన దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి కర్ణాటక నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయి. దాంతో అక్కడి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేయడంతో టికెట్ వచ్చిందంట. టికెట్ ఇప్పించుకోవడమే కాదు.. ఇప్పుడు దీపిక గెలుపు బాధ్యతలను కూడా పెద్దిరెడ్డే భుజానికెత్తుకున్నారంటే.. కర్ణాటక బాబుల సిఫార్సు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ నాలుగో జాబితాలో మడకశిర వైసీపీ ఇన్చార్జ్గా ఈర లక్కప్ప అనే కొత్త ముఖాన్ని ప్రకటించారు. ఆయన కర్ణాటక బిజినెస్‌మాన్ శివకుమార్ రికమండేషన్‌తో వైసీపీ లిస్ట్‌లో ప్లేస్ దక్కించుకున్నారు. సీఐడీ సీఐ శుభకుమార్ వైపు జగన్ మొగ్గినా కర్ణాటక లాబీయింగ్ దెబ్బకు జగన్ తగ్గిపోయారు. ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ .. ఆమె గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా పనిచేశారు.. శ్రీరాములు సోదరి.
జగన్ ఇలా వ్యాపార ఒత్తిళ్లతో సీట్లు కేటాయిస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.