2025 సంక్రాంతికి గురి పెట్టారు చిరంజీవి. ‘విశ్వంభర’ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉంది చిత్రబృందం. ఈ విషయాన్ని ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్లోనే స్పష్టం చేసింది. పెద్ద సినిమా కదా, అని సంక్రాంతి బరిలో దింపడం లేదు. నిజంగానే కథలో కూడా సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించబోతున్నాడు. భీమవరం అంటే సంక్రాంతి వైభోగం గుర్తొస్తుంది. అక్కడ కోడిపందాలు బాగా ఫేమస్. పేకాట రాయుళ్లకు కొదవ ఉండదు. ఆ వాతావరణం అంతా.. ఈ సినిమాలో కనిపించబోతోందని టాక్.
ఈ సంక్రాంతికి వచ్చిన ‘నా సామిరంగ’ కూడా ఇదే థియరీ ఫాలో అయ్యింది. సినిమా అంతా సంక్రాంతి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విజయంలో ఆ పండగ వైబ్స్ కూడా భాగం అయ్యాయి. అదే ఫార్ములా ‘విశ్వంభర’లో కనిపించబోతోంది. వాటికి సంబంధించిన సన్నివేశాలన్నీ భీమవరం తదితర ప్రాంతాల్లోనే తెరకెక్కిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో హైదరాబదాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెట్ తీర్చిదిద్దుతున్నారు. ఇందులోనే సింహభాగం షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు త్రిష కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నారు.