జగన్ రెడ్డి ఐదేళ్లు పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఈ ఐదేళ్లూ సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్ని కలవలేదు. ఇక ముందు కలుస్తారని గ్యారంటీ లేదు. ఆయనకు అసలు అలాంటి ఆలోచనలు కూడా లేవు. ప్రజలు దగ్గరకు వస్తారని తెలుసు కాబట్టి ఆయన తన చుట్టూ వైఫైలా ఎప్పుడూ 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. పోలీసు రాజ్యం నిర్వహిస్తూ పాలన చేస్తున్నారు.
సీఎం ఇంటి దగ్గర ఐదేళ్ల నుంచి 144 సెక్షన్
ముఖ్యమంత్రి ఇల్లు లేదా క్యాంప్ ఆఫీస్ అంటే.. సామాన్య ప్రజలకు ఓ ఆసరా. ఓ ఆర్జీ పట్టుకుని అక్కడికి వెళ్తే కుదిరితే సాయం.. లేకపోతే భరోసా అయినా ఇస్తారన్ననమ్మకం ఉంటుంది. కానీ జగన్ రెడ్డి ఇంటి దగ్గరకు అనుమతి లేకుండా చీమలు కూడా వెళ్లలేవు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన ఇంటి దగ్గర పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటి దగ్గర అంటే.. ఇంటి చుట్టుపక్కల అనుకుంటారేమో కానీ ఆ ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతూ ఉంటాయి. ప్రజలంటే ఇంత భయపడే ముఖ్యమంత్రి చరిత్రలో లేడు.. రాడు.
పాదయాత్రలో వందలకొద్దీ హామీలు – అందరూ అడగడమే !
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఓ డేట్ ఇచ్చారు. వెంటనే కొన్ని వేల మంది వచ్చారు. వారిని చూసి భయపడ్డారో పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయడం అసాధ్యనుకున్నారో కానీ ప్రజాదర్బార్ ఐదేళ్లలో ఒక్క సారి కూడా చేయలేదు సరి కదా… ఇంటి దగ్గరకు ఎవర్నీ రానీయకుండా కట్టడి చేశారు. జగన్ రెడ్డిపాదయాత్రలో ప్రతి ఒక్కరికీ హామీలు ఇచ్చారు. నోటికొచ్చిన హమీలు ఇచ్చి.. అడిగిన డిమాండ్ నెరవేరుస్తామని చెప్పారు. పదవి చేపట్టిన వెంటనే వారంతా అడగడం ప్రారంభిచారు. కానీ జగన్ రెడ్డి పోలీసుల సాయంతో 144 సెక్షన్ విధించుకుని ఎవరికీ ముఖం చూపించకుండా ప్యాలెస్ లో గడిపేయడం ప్రారంభించారు.
ప్రజలు ప్రశ్నిస్తారని దాక్కునే ఏకైక సీఎం
బయటకు వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయపడే ఏకైక సీఎం జగన్ రెడ్డి. అందుకే ఎవర్నీ దగ్గరకు రానీయరు. చివరికి సొంత పార్టీ నేతల్ని కూడా దగ్గరకు రానీయరు. ఇంతగా భయపడాల్సినంత హామీలు ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలి. నవరత్నాల పేరుతో ప్రచారం పేరుతో సొంత సంస్థకు వందల కోట్లు ప్రజాధనం దోచి పెట్టడం తప్ప చేసిందేమీ లేదు. త్వరలోనే ముఖ్యమంత్రికి వైఫైలా ఉండే 144 సెక్షన్ పీకేయడానికి జగన్ రెడీగా ఉన్నారు.