ఇస్తారా.. ఇవ్వరా అన్నది చెప్పరు కానీ.. పిలిపించుకుంటారు.. తీరా వచ్చిన తర్వాత .. మళ్లీ రావాలని పంపేస్తారు. ఒంగోలు విషయంలో సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. నిన్న ఆయన సీఎంవోకు వచ్చారు. కానీ కారు దిగకుండానే వెనక్కి వెళ్లిపోయారు. సీఎం ఉన్నా కలిసే అవకాశం లేదని చెప్పడంతో పాటు.. ధనుంజయ్ రెడ్డితో మాట్లాడాల్సి న పరిస్థితి ఉండటంతో ఇష్టం లేక ఆయన వెళ్లిపోయారు.
అయితే బాలినేని తాజాగా తనకు అసెంబ్లీ.. తన కుమారుడికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. చెవిరెడ్డి, రోజా అంటూ ఎవరెవర్నో తెచ్చి పెట్టే బదులు తన కుమారుడికి సీటిస్తే కుమారుడితో పాటు మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని గెలిపించుకుంటానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒంగోలు నుంచి ఆయనకే గ్యారంటీ లేదని.. ఆయన కుమారుడికి ఎంపీ టిక్కెట్ అంటే కామెడీగా ఉంటుందని వైసీపీలో సెటైర్లు వేస్తున్నారు.
బాలినేని, జగన్ మధ్య ఓ కనిపించని మైండ్ గేమ్ నడుస్తోందని.. ఎవరు ఎవర్నీ ట్రాప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు గుసగసలాడుకుంటున్నారు. పైకి మాత్రం బాలినేనికి జగన్ నిరాదరణ అన్నట్లుగా కనిపిస్తోంది కానీ బాలినేని మాత్రం…. చివరికి జగన్ రెడ్డిపై నిందలేసి .. పక్కకు తప్పుకునేలా వ్యవహారాలు చక్క బెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరుపై అనుమానంతోనే ఉంకా సీట్లు ఖరారు చేయడం లేదని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి.