తెలంగాణ ఎన్నికల్లో ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లతో కేటీఆర్ చేయించిన విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గులాబీ జెండలే రామక్క అంటూ ఆయన అంటార్కిటికా నుంచి అలంపూర్ వరకూ ఎంత మంది ఇన్ ఫ్లూయన్సర్స్ ఉంటే వారందరితో వీడియోలు చేయించారు. చివరికి అది పెద్ద ఫ్లాప్ గా మిగిలిగింది. అయినా ఏపీలోని వైసీపీ పాఠాలు నేర్చుకోలేదు.. కొత్తగా అదే ఫార్ములాను ప్రయోగించింది. రెండు రోజులుగా ఇన్ ఫ్లూయన్సర్స్ వీడియోలు చేస్తూంటే వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది.
వారికి తీవ్రమైన నెగెటివిటి రావడంతో భయపడిపోయి.. చాలా మంది వివరణ ఇచ్చారు. తాము జగన్ రెడ్డికి సపోర్ట్ చేయడం లేదని.. ప్రమోషన్ వర్క్ లో భాగంగానే ఆ వీడియోలు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత వారిపై బలంగా కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఎంత కక్కుర్తిలో ఉందంటే.. ఎవరు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంటే వారికి ఎంతో కొంత ఇచ్చి జగన్ రెడ్డి మాకు ఫలానాది చేశాడని చెప్పిస్తున్నారు. తాజాగా స్ట్రీట్ ఫుడ్ అమ్మే ఓ అంటీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె రోజుకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తారని చెప్పుకుంటూ ఉంటారు. వైరల్ కావడంతో ఆమె బండి వద్దకు చాలా మంది జనం వెళ్తున్నారు. పెద్ద క్యూ ఉంటుంది. ఆమెకు కూడా డబ్బులిచ్చి.. తమకు జగన్ రెడ్డి ఇల్లు ఇచ్చారని చెప్పించారు. దాన్ని అపీషియల్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఏపీలో సెంటు స్థలం ఇచ్చినా అక్కడ బతకడానికి లేకుండా చేశారని సెటైర్లు కూడా ఈ వీడియోలో పడుతున్నాయి. సెంటు స్థలం ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. స్థలం మాత్రం ఇచ్చారు. ఆ సెంట్ స్థలంలో ఇల్లు కట్టలేరు కూడా. అయినా సామాన్యులే తమ బ్రాండ్ అంబాసిడర్లంటూ.. ఇలా అందరికీ డబ్బులిచ్చి ప్రచారం చేసేసుకుంటున్నారు. నిజంగా ఆమెకు ఇల్లు ఇచ్చి ఉంటే.. ఆ ఇంటి దగ్గరకు పోయి చూపించి ఉండేవారు. కానీ నయానా, భయానా చెప్పించి.. రచ్చ చేస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా తీరు చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. సజ్జల కుమారుడికి సజ్జలకు ఉన్నంత తెలివిలో ఒక్క శాతం కూడా లేదని సెటైర్లు వేస్తున్నారు.