సీఎంగా జగన్ రెడ్డి ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. తన పాలన గురించి ప్రజలకు చెప్పడానికిఆయన ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదు. వస్తే మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. టూ లెంగ్తీ క్వశ్చన్స్ అడుగుతారని ఆయన భయం ఏమో కానీ అసలు మీడియా సమావేశాలే పెట్టలేదు. కనీసం ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానితో .. అమిత్ షాతో మాట్లాడినప్పుడు అయినా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకుంటారు. కానీ జగన ్రెడ్డి అలాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ కూడా జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతారు.
సీఎం జగన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఒక్క సారి ప్రెస్‌మీట్ పెట్టారు. అది ఎప్పుడు అంటే.. కరోనా లాక్ డౌన్ విధించినందున స్థానిక ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేశారు. ఈ అంశంపై ఆవేశంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసి.. తర్వాత ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు విని జర్నలిస్టులు నోరెళ్లబెట్టారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వెళ్లిపోయారు. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు వినలేదేమో కానీ.. . ఆ దెబ్బతో మళ్లీ ప్రెస్ మీట్ జోలికే రాలేదు. ఎస్ఈసీపై బండలేయడానికి ప్రెస్‌మీట్ పెట్టారు కానీ రాష్ట్ర అంశాలపై మాట్లాడేందుకు ఒక్క మీడియా సమావేశం నిర్వహించలేదు.
నీలి కూలి మీడియాకు సంబంధించి ఎప్పుడైనా ఇంటర్యూలు ఇవ్వాలనుకుంటే.. స్క్రిప్టెడ్ ఇంటర్యూలు ఇస్తారు. ఇంటర్యూలు అడిగేవారు కూడా అవే ప్రశ్నలు అడుగుతారు కానీ.. కొత్త ప్రశ్నలు వేయకూడదు. వేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అనుకున్నట్లుగా ఉంటుంది. ఇంత తెలివితేటలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కేసీఆర్ అరుదుగా ప్రెస్మీట్లు పెడతారు. కానీ ఆయన మీడియాపై భయంతో కాదు. ఎలాంటి మీడియాను అయినా ఎదుర్కొంటారు. కానీ జగన్ రెడ్డి మాత్రం మీడియాను ఎదుర్కోలేని నిస్సహాయతతోనే ప్రెస్మీట్లకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆయన తన పాలనలో చేసిందేమీ లేదు. చెప్పుకునేదీ ఏదీ లేదు. నొక్కే బటన్లు కూడా ఇప్పుడు పని చేయడం లేదు.