దిగిపోయే ముందు జగన్ రెడ్డి పెట్టుబడుల ఆమోదం అంటూ స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి ఐదు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ ఐదు ప్రతిపాదనలు ఊరూపేరు లేని కంపెనీలు.. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు పెడతామని ముందుకొచ్చివవే. ఇప్పటికే సోలార్, విండ్ పవర్ పేరుతో వేల ఎకరాలు రాయలసీమలో పలు కంపెనీలకు కట్టబెట్టారు. ఇప్పుడీ కంపెనీలకు ఇంకెన్ని ఎకరాలు ఇస్తారో కానీ.. అసలు సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు ఎంతో వీలుగా ఉండే రాజస్థాన్ లో కూడా ఇన్ని పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం లేదు.
రూపాయి పెట్టుబడి లేని కంపెనీలు వేల కోట్లు పెట్టుబడులు ఎలా పెడతాయో ఎవరూ అడగరు చెప్పరు కూడా. నిజానికి సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రావు. చాలా పరిమితమైన మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అయినా ఈ పెట్టుబడులే సీఎం జగన్ రెడ్డిని చూసి ఎందుకు వస్తున్నాయో వారికే తెలియాలి. ప్రపంచంలో ఎన్నో తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలు పోటీ పడి పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నాయి.
కానీ జగన్ రెడ్డి పెట్టుబడుల కోసం చిన్న ప్రయత్నం చేయరు. లెంగ్తీ క్వశ్చన్స్ అడుగుతారని దావోస్ లాంటి సమావేశాలకూ వెళ్లరు. ఆయన విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయింది. యువత పూర్తిగా నిరాశా నిస్ప్రహల్లో కూరుకుపోయింది. కానీ రాష్ట్రంలోని భూముల్ని మాత్రం.. బినామీ పేర్లతో దోచుకునేందుకు లెక్కలేనన్ని ఊరూ పేరూ లేని కంపెనీలు పెట్టుబడుల పేరుతో సోలార్ కంపెనీలు మాత్రం వచ్చేస్తున్నాయి.