వల్లభనేని వంశీ తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ రివర్స్ లో వైసీపీ హైకమాండ్‌పై బెదిరింపులకు దిగుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు ప్రత్యామ్నాయాన్ని చూడటానికి పార్థసారధిని గన్నవరం నుంచి పోటీ చేయమని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత వల్లభనేని వంశీ బాగా హర్టయ్యారు. పార్థసారధి వద్దనుకున్న తర్వాత కూడా కొంత మంది పేర్లు పరిశీలిస్తున్నారని తెలియడంతో ఆయన నియోజకవర్గం వైపు రావడం మానేశారు.
నెలన్నర నుంచి ఆయన గన్నవరంలో లేడు. హైదరాబాద్ లో నే ఉంటున్నారు. అనుచరులతో కూడా టచ్ లో లేరని…. చెబుతున్నారు. ఆయన పార్టీ వ్యవహారాలు పట్టించుకోవడం లేదని ఇంటలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో వైసీపీ పెద్దలు వంశీని సంప్రదించారు. తన వద్ద డబ్బుల్లేవని ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనను పోటీకి దింపాలా .. బాగా డబ్బులున్న నేతను వెదుక్కోవాలా అని వైసీపీ ఆలోచిస్తోంది.
వంశీతో అడ్డగోలు మాటలు మాట్లాడించిన జగన్ రెడ్డి అండ్ కో ఆయనను అందరికీ శత్రువుని చేశారు. వంశీకి మరో పార్టీలో చోటు దొరకదు సరి కదా.. ప్రభుత్వం మారితే ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఆజ్ఞాతంలోకి పారిపోవాల్సినంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇాలాంటి సిట్యూయేషన్ లో ఉన్న పార్టీలో ఉండి.. గట్టిగా పోరాడి ఏదో ఒకటి చేయాల్సింది ముందే చేతులెత్తేయడం ఆసక్తికరంగా మారింది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు … టీడీపీ తరపున దూకుడు మీద ఉన్నారు. ఆయనను తట్టుకోలేనని వంశీ అంటున్నట్లుగా చెబుతున్నారు.
వల్లభనేని వంశీ పారిపోతే.. మరి కొడాలి నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నారు…. ఆయనకు కావాల్సిన ఆర్థిక సాయం చేస్తానని చెప్పి తీసుకొచ్చి.. గన్నవరంలో తిప్పాలి కదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.