వైఎస్ కుటుంబం అంతా చంద్రబాబు గుప్పిట్లో ఉందని అందరూ ఆయన చెప్పినట్లే చేస్తున్నారని సాక్షి పత్రికలో రాతలు ప్రారంభించారు. వైఎస్ వివేకానందరెడ్డి తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం బయటకు రాగానే సాక్షిలో కట్టుకథలు రాయడానికి ఉన్న నిపుణులైన స్టోరీ రైటర్లు తమ పెన్నులు కదిల్చారు. వారి నైపుణ్యంలో వేరో కోణం ఉండదు అంతా… చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు. ఈ సారి కూడా అదే చేశారు. కానీ వారు జగన్ రెడ్డి పరువు తీస్తున్నామని మాత్రం అనుకోలేకపోయారు.
కడప జిల్లాలో వైఎస్ కుటుంబం అంతా చంద్రబాబు కనుసన్నల్లో ఉందని.. ఆయన చెప్పినట్లే రాజకీయాలు చేస్తున్నారని ఓ పెద్ద కథనం అచ్చేసి వదిలేశారు.దాన్ని చదివిన ఎవరికైనా … జగన్ రెడ్డి ఇంత చేతకానోడా అన్న అభిప్రాయం కలగడం సహజం. ఎందుకంటే.. తల్లి , చెల్లి సహా ఆయన బందువులు అంతా జగన్ రెడ్డిపై నమ్మకం కోల్పోయి… చంద్రబాబు పంచన చేరారన్నట్లుగా ఆ రాతలు ఉన్నాయి. కుటుంబాన్ని కూడా కాపాడుకోలేక … చంద్రబాబుపై ఆరోపణలు చేసుకుంటూ చేతకాని తనాన్ని బయట పెట్టుకుంటున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
కుటుంబం నుంచి ఒక్కరు బయటకు వెళ్లినా అది జగన్ రెడ్డి చేతకాని తనమే. సొంత కుటుంబ సభ్యుడ్ని అడ్డగోలుగా నరికి చంపితే… న్యాయం చేయలేని జగన్ రెడ్డి హంతకులకు అండగా ఉండటమే కాదు.. .. వారందర్నీ టీడీపీ క్యాంపులోకి నెట్టేస్తున్నారు. వైఎస్ కుటుంబంలో జగన్ రెడ్డికే కాదు అందరికీ పట్టుదల ఉంటుంది. దానికి టీడీపీ లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అన్నీ చంద్రబాబు చేస్తే ఇక జగన్ రెడ్డి ఎందుకని వైసీపీ క్యాడర్ కూడా అనుకునే పరిస్థితి వస్తుంది. మొత్తంగా జగన్ రెడ్డి చేతకాని తనాన్ని సాక్షి సాక్ష్యాలుగా ప్రజల్లోకి వదులుతోంది.