‘భగవంత్ కేసరి’ తరవాత అనిల్ రావిపూడితో చిరంజీవి కాంబినేషన్ సెట్ అవ్వాల్సింది. ఇద్దరి మధ్యా కథా చర్చలు కూడా జరిగాయి. కానీ ఎందుకనో… ఆ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఓ వైపు విశ్వంభర చేస్తూనే, మరోవైపు అనిల్ రావిపూడి సినిమా కూడా పూర్తి చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి వెంకటేష్ తో సెట్టయిపోయారు. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా దాదాపుగా ఖాయమైపోయింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామని భావిస్తున్నారు. వెంకీతో అనిల్ రావిపూడికి ఇది హ్యాట్రిక్ సినిమా కాబోతోంది. ఎఫ్ 2, ఎఫ్ 3లతో వీరిద్దరూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఈ సినిమాకీ ఎఫ్ 2 ఫ్రాంచైజీకీ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త కథ. చిరంజీవికి చెప్పిన కథే… వెంకటేష్ దగ్గరకు వెళ్లిందని వార్తలొస్తున్నాయి. ఓ మంచి రోజు చూసి ఈ సినిమాని లాంఛనంగా మొదలెట్టేస్తారు. పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడవుతాయి.