విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్ లో ‘ఫ్యామిలీ స్టార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టైటిల్ బట్టి చెప్పేయొచ్చు. ఇది కుటుంబ కథా చిత్రమిది. కాకపోతే.. కొంచెం యాక్షన్ తో పాటుగా ఓ క్యూట్ లవ్ స్టోరీని మిక్స్ చేశారు.
ఈ కథ కాస్త అటూ ఇటుగా చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ కొలతల్లో సాగుతుందని సమాచారం. గ్యాంగ్ లీడర్ లో ఇద్దరు అన్నల ముద్దుల తమ్ముడిగా చిరు నటించాడు. ఇందులో విజయ్ కూడా అంతే. చిరు ఇంట్లోకి విజయశాంతి రెంట్‌కి దిగి.. ప్రేమలో పడుతుంది. ఈ సినిమాలోనూ విజయ్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమలో పడిపోతుందని టాక్. ‘గ్యాంగ్ లీడర్’లో హీరో విలన్ పై రివైంజ్ తీర్చుకొంటాడు. ఇక్కడ మాత్రం హీరోయిన్ పైనే రివైంజ్ డ్రామా నడిపాడని టాక్. ‘గీత గోవిందం’లో లవ్ ట్రాక్.. సూపర్బ్ గా రాసుకొన్నాడు పరశురామ్. ఈ కథలో కూడా లవ్ స్టోరీ కొత్తగా డిజైన్ చేశాడట. అందులోంచే ఫన్, ఎమోషన్, ట్విస్ట్ పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఎలాంటి సినిమాని ఆశిస్తారో, అలాంటి సినిమానే పరశురామ్ డిజైన్ చేశాడని టీ టౌన్ టాక్.