తిరుపతిలో ఎన్నికల అధికారిగా ఉన్న మున్సిపల్ కమిషనర్ లాగిన్ ను.. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడు వాడేసుకుని ఓటర్ కార్డులు డౌన్ లోడ్ చేసి.. నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు. ఆయన రేపు జైలుకెళ్తారా లేకపోతే.. ఆయన లాగిన్ వాడిన వారు వెళ్తారా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్ సమాచారాన్ని కూడా పూర్తి స్థాయిలో చోరీ చేశారన్న ప్రచారం ప్రారంభమయింది. ఈ అంశంపై ఢిల్లీలోని ఈసీ అధికారులకు రాష్ట్ర సీఈవో సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.
ఐ ప్యాక్ చెందిన వారిని ఇద్దరిని ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్దతిలో ఏపీ ఎన్నికలసంఘంలో కొంత కాలం కిందట నియమించింది. వారు కేవలం రెండు అంటే రెండు నెలలు మాత్రమే పని చేశారు. ఈఆర్వోల లాగిన్లు,. ఈఈఆర్వోల లాగిన్లతో పాటు ఈసీ డేటా మొత్తం రెండు నెలలు వారి వద్దే ఉన్నాయి. డేటా మొత్తం చేతుల్లోకి వచ్చిన తర్వాత మానేశారు. రెండు నెలల వ్యవధిలోనే ఈసీ సర్వర్‌లో ఉన్న డేటా, హార్ట్డిస్కుల్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్నట్లుగా అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి.
2021, 2022 ఏడాదికి సంబంధించిన డేటా ప్రస్తుతం కనిపించడం లేదు. కంప్యూటర్ హార్డ్‌డి్‌స్కలు, సీఈసీ నుంచి వచ్చిన మెయిల్స్ ఏవీ లేవని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికల సమయంలో ఈసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సహయం తీసుకున్న వైసీపీ, ఇప్పుడు ఐ – ప్యాక్ టీమ్‌తో మరింత డేటా సేకరించింది. ఈ రెండు అంశాలు ఈసీకి తలనొప్పిగా మారాయని అంటున్నారు. ఇంతటి ఘోరమైన తప్పును ఈసీ ఎలా తీసుకుంటుంది.. పరువు పోతుుందని సైలెంట్ గా ఉంటుందా.. అక్రమార్కులపై కొడరా ఝళిపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది.