ధనుంజయ్ రెడ్డి అంటే… సీఎంవో చీఫ్. జగన్ కు రైట్ హ్యాండ్. పార్టీ వ్యవహారాలను కూడా ఆయనే ఒంటి చేతులతో నడిపేస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఎన్నికల్లో నిలబడే అవకాశం కనిపిస్తోంది. రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డికి చెక్ పెట్టేసిన జగన్.. ధనుంజయ్ రెడ్డిని నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఐఏఎస్ అధికారి, ప్రస్తుత సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్ఢిని ఎన్నికల బరిలోకి దింపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాయచోటి మండలం చెన్నముక్కపల్లె గ్రామానికి చెందిన ధనుంజయ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం ఉంది. ఆయన కుటుంబం చేతుల్లోనే పంచాయతీ ఉంది. ఐఏఎస్ అధికారిగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో జగన్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. జగన్ కు క్లాస్ మేట్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 2009 ఎన్నికల్లో తండ్రి దివంగత వైఎస్ దగ్గర పట్టుబట్టి మరీ రాయచోటి టికెట్ ఇప్పించారు . శ్రీకాంత్‌రెడ్డి తండ్రి గడికోట మోహన్‌రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో అప్పటి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అప్పట్లో అమెరికా వెళ్లి 11 ఏళ్లు ఐటీ కెరీర్లో శ్రీకాంత్.. రాజకీయాల మీద ఆసక్తితో ఏపీకి తిరిగొచ్చి తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో లక్కిరెడ్డిపల్లె సెగ్మెంట్ మాయమవ్వడంతో.. రాయచోటి నుంచి పోటీ చేస్తూ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్న జగన్ ఆయనను మార్చాలని ఇప్పటికే డిసైడయ్యారు. అయితే మెడపట్టి బయటకు గెంటినా తాను పోనని.. శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు.