వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి ఇప్పటికి ఆరుజాబితాలు విడుదల చేశారు. అంత అవసరం ఏమొచ్చిందో కానీ.. ఆయన జాబితాల మీద జాబితాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఏడో జాబితా కూడా రెడీ అవుతోందని రెండు రోజుల కిందట మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యసభ ఎన్నికల వరకూ ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేల సంఖ్య పలుచగా ఉంది. వారిలో సంతృప్తిలెవరో.. అసంతృప్తులెవరో తెలియడం లేదు. అసెంబ్లీలో గతంలోలాగా టీడీపీ సభ్యుల్ని గట్టిగా ఎవరూ ఎదుర్కోవడం లేదు.
ఈ పరిణామాలన్నింటినీ గమనించిన జగన్ రెడ్డి ఈ సారి జాబితా గురించి పక్కన పెట్టారు. నిజానికి అసలు మార్చాలనుకుంటున్న నియోజకవర్గాలు ఇప్పుడే ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. వరుసగా గెలుస్తూ.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న రెడ్డి సామాజికవర్గ నేతల్ని పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఓ ముఫ్పై, నలభై వరకూ మార్పులుంటాయని అంచనా. చివరికి శ్రీకాంత్ రెడ్డి వంటి వారికీ గ్యారంటీ లేదు. వారికి ఇప్పుడు టిక్కెట్ నిరాకరిస్తే తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. అన్నీ ఆలోచించి రాజ్యసభ ఎన్నికలు అయ్యే వరకూ ఇంక ఎలాంటి లీకులు ఇవ్వకుండా.. అభ్యర్థులపై కసరత్తు చేయకుంా టైం పాస్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే తొందరపడి ప్రకటించిన జాబితాల వల్ల పార్టీలో సంక్షోభం ఏర్పడిందని..టిక్కెట్ దక్కని వాళ్లు పూర్తిగా రివర్స్ అయితే.. టిక్కెట్ దక్కిన వాళ్లు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితికి వెళ్లారని అంటున్నారు.