హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణను ఓడించడానికి పెద్దిరెడ్డి కాంట్రాక్టుల రూపంలో సీఎం జగన్ దగ్గర సుపారీ తీసుకున్నారు. అందుకే ఆయన ఇటీవల హిందూపురం నియోజకవర్గంలో ఏకంగా ఆరు రోజుల పాటు మకాం వేశారు. అన్ని మండలాల నేతలతో సమావేశం అయ్యారు. టీడీపీ నేతలతో మంతనాలు జరిపారు. వైసీపీలోకి వస్తే ఇంతిస్తాం అని బేరమాడారు. చాలా ప్రయత్నాలు చేశాకా ఆయన తిరిగి వెళ్లారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీలో నుంచే టీడీపీలో చేరిపోతున్నారు నేతలు. బంపర్ ఆఫర్లు ఇచ్చినా హిందూపురం టీడీపీ నేతలు రాకపోగా వైసీపీ నేతలు .. టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూండటంతో పెద్దిరెడ్డికి షాక్ తగిలినట్లయింది. వైసీపీ కౌన్సిలర్ ఒకరు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనను పోలీసులతో బెదిరించారు. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన టీడీపీలో చేరిపోయారు. వైసీపీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరిపోతున్నారు.
పెద్దిరెడ్డి మనీ పవర్ హిందూపురంలో పని చేయడంలేదని తేలిపోయింది. బాలకృష్ణ ఇప్పుడు హిందూపురం రాజకీయంపై బాగానే దృష్టి పెట్టారు. ఇతర వ్యాపకాలతో ఎంత బిజీగా ఉన్నా హిందూపురం క్యాడర్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఆయన మరింత బలోపేతం అవుతున్నారు. చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తూ.. వైసీపీ.. కుల రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.