తిరపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం కింది స్థాయి వారిపై చర్యలు తీసుకుని సరి పెడుతోంది. తాజాగా తిరుపతి తూర్పు, పశ్చిమ పోలీసులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రుపతి లోక్ సభ ఉపఎన్నికల వ్యవహారంలో దర్యాప్తు చేయకుండా కేసుల్ని క్లోజ్ చేసినందున తిరుపతి నగర తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి, పశ్చిమ సీఐ శివప్రసాద్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేేశారు.
తిరుపతి తూర్పు పీఎస్ ఎస్ఐ జయస్వాములు ..తిరుపతి తూర్పు పీఎస్ హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. అలిపిరి సీఐ అబ్బన్న వీఆర్ కు బదిలీ చేశారు. వీరంతా తిరుపతి ఎంపీ ఉపఎన్నిక వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారు. సాక్ష్యాధారాలు లేవని పశ్చిమ సీఐ శివప్రసాద్ కేసు మూసి వేశారు. అయితే వీరు పాత్ర ధారులే. ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది కింది వారిపై గురి పెట్టి వారిని బలి చేయడం పోలీసు శాఖలోనే విస్మయం వ్యక్తమవుతోంది.
ఇద్దరు ఐపీఎస్‌లను కాపాడటానికి కింది వారిని బలి చేస్తున్నట్లుగా చెబుతున్నారు . చర్యలు తీసుకోవాలని.. ఈసీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూంటే.. అప్పుడొకర్ని అప్పుడొకర్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారుల్ని అరెస్టు చేయడానికి స్వయంగా ఈసీ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి నిండా ఇరుక్కుపోయే సూచనలు కనిపిస్తున్నాయి.