యాత్ర సినిమా సమయంలో ఏపీలో సినిమాను ప్రజలు డబ్బులు పెట్టి చూడలేదు కానీ.. పార్టీ నేతలు తమ డబ్బులు పెట్టి ఆడించారు. ఉచితంగా ప్రజలకు చూపించారు. అప్పుడు ఉన్న మూడ్ ను బట్టి ప్రజలు కూడా ఉచితంగా వచ్చే సినిమానే కదా అని చూశారు. ఇప్పుడు యాత్ర 2 సినిమా విడుదలయింది. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ పూర్తిగా ఎవాయిడ్ చేసింది. పార్టీపై అభిమానంతో లేదా.. నాయకుడిపై అభిమానంతో ఆ సినిమా చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఆ విషయం కలెక్షన్లలో స్పష్టమవుతోంది.
సినిమాకు స్వచ్చందంగా ప్రజలు ఎవరూ రారు. కానీ పార్టీ కార్యకర్తలు అయినా రావాలి కదా ! తొలి రోజు.. రెండు కోట్ల రూపాయలు నెట్ వచ్చింది. అందులోనూ సగం గుంటూరు నుంచి వచ్చింది. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజనీ ఖాతాలో ఆ ఖర్చు ఎక్కువగా పడింది. మిగిలిన చోట్ల ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొత్త సమన్వయకర్తలు కూడా ఆ బాధ్యతలు తీసుకోలేదు. తాము కూడా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఎంతగా అంటే చివరికి సొంత జిల్లా కడప క్యాడర్ కూడా లైట్ తీసుకున్నారు
క్యాడర్ ను జగన్ రెడ్డి దివాలా తీయించారు. ఎంతగా అంటే.. చివరికి కడపలో వారికి కూడా ఇటీవల క్యాడర్ రేంజ్ ను బట్టి డబ్బులు పంచాల్సి వచ్చింది. సొంత పాలనలో వారంత అంతగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారంటే.. మరి మిగిలిన చోట్ల పరిస్థితి ఎలా ఉండాలి ?. అంత కంటే ఘోరంగా ఉందని తేలిపోతోంది. ఓ వంద రూపాయలు ఖర్చు పెట్టి.. వైసీపీ కార్యకర్తలు యాత్ర 2 సినిమాను చూసేందుకు సిద్ధంగా లేరు. క్యాడర్ కొట్టే దెబ్బ ఎలా ఉండబోతోందో..యాత్ర కలెక్షన్లు.. వైసీపీకి చూపిస్తున్నాయి.