‘పుష్ప 2’… అదొక్క‌టే మార్పు

‘పుష్ప’ ఊహించ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకొంది. సౌత్‌లో కంటే.. నార్త్ లో ఈ సినిమా ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకొంది. దాంతో ‘పుష్ష 2’పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకొన్నాడు. ‘పుష్ష 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదు. ‘పుష్ష 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారు. ఒకే ఒక్క మార్పు… జ‌గ‌ప‌తిబాబు. ఈ పాత్ర మాత్ర‌మే ‘పుష్ష 2’లో కొత్త‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ మార‌బోతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే టీమ్ మాత్రం ఆగ‌స్టు 15కే ఫిక్స‌య్యింది. అందుకే షూటింగ్ చక చ‌క ముందుకు తీసుకెళ్తున్నారు. సుకుమార్ సినిమాల్లో ఐటెమ్ గీతాల‌కున్న ప్రాధాన్యం చెప్పాల్సిన ప‌నిలేదు. ‘పుష్ష 1’లో స‌మంత‌తో ఐటెమ్ చేయించారు. పార్ట్ 2లో కూడా ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింప‌బోతున్నారు. ఇప్ప‌టికే ట్యూన్ సిద్ధ‌మైంద‌ని, చంద్ర‌బోస్ ఓ వెరైటీ పాయింట్ తో.. ఈ పాట‌ని రాయ‌బోతున్నార‌ని స‌మాచారం. మ‌రి.. ఈ పాట ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close