తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు సూపర్ 6 ను ఇంటింటికి చేర్చేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సూపర్ సిక్స్ హామీలు.. గ్యారంటీ కార్డులతో కూడిన కిట్‌ను ప్రతి ఇంటికి పంపుతున్నారు ఎన్నికల్లోపు అందరికీ ఆ హామీల కిట్ చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శంఖారావం సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నారా లోకేష్… పార్టీని ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై.. సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు.
సోమవారం సూపర్ 6 హామీలపై సోషల్ మీడియాలో హోరెత్తింది. విస్తృతంగా ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎలా చేస్తున్నారో… క్షేత్ర స్థాయిలోనూ అంతే ఆ పథకాలపై విస్తృత ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా మహిళలను ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితం హామీలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో ఏపీలో మహిళలనూ ఆకర్షిస్తోంది. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గుతున్నారు. వారి బాధ తీర్చేలా టీడీపీ గ్యారంటీ ఉంది.
సామాన్యుల కష్టాలు తీర్చేలా పథకాలు ఉండటంతో ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతున్నాయి. జగన్ రెడ్డి హ యాంలో పథకాలన్నీ డొల్లగా మారిపోయాయి. బటన్లు నొక్కుతున్నా డబ్బులు పడటం లేదు. రెండేళ్లుగా ఎన్ని బటన్లు నొక్కారో కానీ ప్రతి పథకంలోనూ లబ్దిదారులు పెడింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇలాంటివన్నీ టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. టీడీపీ సూపర్ సిక్స్ హామీలకు.. గ్యారంటీ కార్డులను కూడా పంపిణీ చేస్తోంది.