ఏపీలో ఎన్నికల టైం దగ్గర పడటంతో .. జనసేన అధినేత పవన్కళ్యాణ్ పూర్తిస్థాయిలో ప్రచారానికి సిద్దయయ్యారు … టీడీపీ, జనసేన శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగడానికి … రాష్ట్రవ్యాప్తంగా మీటింగులు పెట్టి వారికి దిశానిర్ధేశం చేయనున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసేలా చూడటానికి .. పార్టీ శ్రేణులను సమాయాత్తం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారానికి .. మూడు దశల్లో ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. అన్ని పార్టీలకు కీలకమైన గోదావరి జిల్లాల నుంచే జనసేనాని తన సన్నాహాలు మొదలుపెట్టనున్నారు.
మూడు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్న పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులతో భేటీ అయి .. నేతల మధ్య గ్యాప్ లేకుండా కలిసి ముందుకు సాగడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తొలిదశ పర్యటన నాలుగు రోజుల పాటు భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో జరగనుంది. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్న ఆయన. పార్టీ నేతలు తొందరపడి పార్టీ విధానాలకు భిన్నంగా భావోద్వేగంతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సుతిమెత్తగా తన అభిమానులను హెచ్చరించారు. రెండోదశ పర్యటనను కూడాపవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. రెండో విడతగా జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలుపోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటిస్తారని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలను పవన్ గైడ్ చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లడం వల్ల ప్రయోజనాలు ఉండడంతో జనసేన పోటీ చేస్తున్న సెగ్మెంట్లలో టీడీపీ శ్రేణులతో కలుపుకుని పోయే వ్యూహాలపై పార్టీ నేతలకు పవన్ స్పష్టత ఇవ్వనున్నారు.
ఇక మూడో విడతలో పూర్తిగా ఎన్నికల ప్రచారానికే పవన్ సమయం కేటాయిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొనే సభలతో పాటు .. కీలక సెగ్మెంట్లలో జనసేన నిర్వహించే సభల్లో కూడా జనసేనాని పొల్గొంటారంట .. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే టీడీపీ చేపట్టిన రా కదలిరా సభల తరహాలో.. పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారంటున్నారు. ఇప్పటికే టీడీపీ నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబు జనసేనతో కలిసి వెళ్ళే అంశంపై ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అదే తరహాలో జనసేన సభల్లో కూడా.. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఉంటాయంటున్నారు.