వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మిగిలిన వారంతా టీడీపీలో చాన్స్ వస్తే చేరిపోతామన్నట్లుగా సిట్యూయేషన్ మారింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఎప్పుడో చర్చలు ముగిశాయి. గత ఎన్నికలకు ముందు… టీడీపీకి హ్యాండిచ్చినట్లే ఇప్పుడు వైసీపీకి హ్యాండివ్వడానికి అదాల ప్రభాకర్ రెడ్డి రెడీ అయిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. వైసీపీ ముఖ్య నేతలంతా.. జంపింగ్ కు రెడీగా ఉన్నారు.
ఇప్పటికే పార్థసారధి , వసంత కృష్ణ ప్రసాద్ సహా పలువురు నేతలు టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు, పొత్తుల విషయంలో అధికారిక ప్రకటన కోసం సరైన ముహుర్తం చూసుకుంటున్న చంద్రబాబు తర్వాత చేరికల విషయంలో ఓ ప్రణాళిక ప్రకారం వ్యహరించనున్నారు. అత్యంత బలమైన అభ్యర్థుల్నే రంగంలోకి దించుతారని అంటున్నారు. గెలుపు గుర్రం అయితే ..ప్రాధాన్యత ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వేమిరెడ్డి లాంటి వారు కూడా వైసీపీని వీడితే ఆ పార్టీ పనైపోయిందని… ఓ సందేశం ప్రజల్లోకి వెళ్తుంది.
టీడీపీలో చేరికలు ఊహించని రీతిలో ఉండబోతున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. జగన్ రెడ్డి ఇప్పటికే ఆరు జాబితాలు రిలీజ్ చేశారు. దాదాపుగా అన్నీ రిజర్వుడు నియోజకవర్గాలే. ఇప్పుడు అసలు కసరత్తు ఉంది. ఎంత మంది జగన్ రెడ్డిపై ఫైరవుతారన్నది తేలాల్సి ఉంది. టిక్కెట్లు లేకపోయినా టీడీపీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపేందుకు అవకాశం కనిపిస్తోంది. జగన్ రెడ్డి పాలనా తీరుతో.. తర్వాత తమను తాము కాపాడుకోవడానికైనా ఇది చాలా ముఖ్యమని భావిస్తున్నారు.