యాత్ర 2 జీరో షేర్ సినిమాగా నిలిచింది. కనీసం యాభై కోట్ల బడ్జెట్ తో విడుదలైన సినిమా .. వారం రో జులు అయ్యే సరికి ధియేటర్లకు ఎదురు రెంట్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. షేర్ కూడా కరిగిపోయి ఉంటుంది. నాన్ థియేటరికల్ రైట్స్ కింద రూపాయి కూడా రాలేదు. ఎలా చూసినా యాత్ర 2 ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ విషయం పక్కన పెడితే.. వైసీపీ నేతలకు ఈ సినిమా రిజల్ట్ ఓ స్పష్టత ఇచ్చింది. అదేమిటంటే… ఈ సారి సొంత ఓటర్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరని.
వైసీపీ సానుభూతిపరులు.. రెడ్డి సామాజికవర్గం వారు కూడా యాత్ర 2 సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు. వచ్చిన అరకొర కలెక్షన్లు.. టిక్కెట్లు పొందిన పార్టీ నేతలు ఖర్చు పెట్టి.. ఓవరాల్ గా కొన్న టిక్కెట్లు మాత్రమే. సొంత డబ్బులు రూ. వంద పెట్టి టిక్కెట్ కొనడానికి వైసీపీ సానుభూతిపరులు కూడా ఆసక్తి చూపించలేదు. ఈ పరిస్థితి ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది. వచ్చిన కలెక్షన్లలో సగం విడదల రజనీ గుంటూరులో కొన్న టిక్కెట్లవే. కడపతో సహా ఏ జిల్లాలోనూ నేతలు తమ సొంత డబ్బులతో టిక్కెట్లు కొనాలనుకోలేదు.
అదే యాత్ర 1 సమయంలో స్థానిక క్యాడర్ ధియేటర్లు లీజుకు తీసుకుని నడిపించారు. ప్రజలకు ఉచితంగా చూపించారు. ఈ సారి ఎవరూ ఆ పని చేయడం లేదు.. ఎవరైనా అరకొరగా ఎక్కడైనా సినిమా నడిపిస్తున్నా చూసేందుకు ఎవరూ రావడం లేదు. ఏపీలో ఈ పరిస్థితిని చూసి వైసీపీ నేతలకూ ఓ క్లారిటీ వస్తుంది. పోయేది ఎలాగూ పోతుంది.. కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరని అంచనాకు వస్తున్నారు.