కొన్ని సినిమాలు కథల వలనో, స్క్రీన్ ప్లే వలనో, హీరోయిజం వలనో హిట్ అవుతాయి. కొన్ని సినిమాల్ని మాత్రం క్యారెక్టరైజేషన్లే విజయాన్ని తీసుకొస్తాయి. అలాంటి సినిమా ‘డీజే టిల్లు’. టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ సింప్లీ సూపర్బ్. ఆ క్యారెక్టర్‌తోనే ఎన్నో సినిమాల్ని తీయొచ్చన్న భరోసాని అందించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తోంది. టిల్లుగా సిద్దు జొన్నలగడ్డే మళ్లీ కనిపించనున్నాడు. పక్కన పోరి మాత్రం మారింది. ఆ స్థానంలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ నిండా టిల్లుగాడి విజృంభణే కనిపించింది. ప్రతీ చోటా.. ప్రతీ మాటలోనూ నవ్వించాడు. తన క్యారెక్టర్‌తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేశాడు. ఇంట్లో పెళ్లి చూపుల డిస్కర్షన్, కారులో అనుపమతో కార్వర్జైషన్, సెక్స్ గురించి చెప్పిన పద్ధతి.. అన్నీ నవ్విస్తాయి. టిల్లు కాదు.. టిప్పు సుల్తాన్ అంటూ తనపై తానే సెటైర్ వేసుకొన్నాడు సిద్దు. చివర్లో చెప్పిన పంచాయితీ డైలాగ్ కూడా.. టిల్లు క్యారెక్టరైజేషన్‌కి అద్దం పట్టేదే. అనుపమ పాత్ర మరీ హాట్ గా రాసుకొన్నారు. కార్లో ముద్దు సీన్లో అనుపమ విజృంభించేసింది. ఇలాంటి హాట్ సన్నివేశాలు ఈ సినిమా నిండా చాలానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈసారి టిల్లుగాడు ఏ పంచాయితీని నెత్తిమీద వేసుకొన్నాడన్నది సస్పెన్స్‌గా ఉంచారు. రిలీజ్‌కి ఇంకా చాలా టైమ్ ఉంది కదా, అప్పుడు మరో ట్రైలర్ వదులుతారేమో చూడాలి. ట్రైలర్లోనే హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ధియేటర్లో ఎంత మోత మోగిపోతుందో చూడాలి.