ఫేక్ పాలనకు ఇదో ప్రత్యక్ష సాక్ష్యం. మొత్తం తెలిస్తే మీరు ఔరా అని ఆశ్చర్యపోతారు. ప్రభుత్వాలు ఇలా కూడా చేస్తాయా.. ఇంత బహిరంగంగా ఫేక్ చేసి.. సిగ్గులేకుండా పాలన చేస్తాయా ? అని ఆశ్చర్యపోతారు. అందరూ విస్తుపోయే ఇలాంటి ఘటనలు ఏపీలో చాలా కామన్.
అమరావతిని కట్టేశామని బ్యాంకులకు లెటర్లు
అమరావతిలో గత ప్రభుత్వం అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లు నిర్మించడానికి ఏర్పాట్లు చేసింది. హై రైజ్ అపార్టుమెంట్లను నిర్మించింది. 70, 80 శాతం పూర్తయిన దశలో ప్రభుత్వం మారింది. పిచ్చి పట్టినట్లుగా ఆ పనులన్నింటినీ ఎక్కడివక్కడ ఆపేశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదు. దీంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కానీ ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా వాటిని నిర్మించేశామని… పూర్తయిపోయాయని.. అక్కడ అధికారులు కాపురం కూడా ఉంటున్నారని బ్యాంకులకు లేఖలు రాసింది. అంతే కాదు సాక్ష్యంగా తాము రెంట్ కడుతున్నట్లుగా రూ. 63 కోట్ల ను సీఆర్డీఏ ఖాతాలో జమ చేసేసింది. ఇదంతా ఎందుకు అంటే… ఒక తప్పును ఇంకో తప్పు ద్వారా కవర్ చేసుకోవడానికి.
రూ. 2వేల కోట్లు కట్టాల్సి వస్తుందని ఫేక్ జీవోలు
అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులకు తీసుకున్న రుణ నిబంధనల ప్రకారం వాటిని పూర్తి చేయాల్సి ఉంది. లేకపోతే మొత్తం రూ రెండు వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించకపోతే ఎన్పీఏలుగా ప్రకటిస్తారు. అలా జరిగితే ప్రభుత్వం దివాలా తీసినట్లే. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర రూ. రెండు వేల కోట్లు ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే.. పెద్దిరెడ్డికో… మేఘా రెడ్డికో బిల్లులు చెల్లించేస్తారు కానీ.. ఇలా బ్యాంకులకు కట్టేంత అవకాశం ఉండదు. అందుకే ఫేక్ తెలివితేటలతో… ఫేక్ ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా బిల్డింగ్లు పూర్తయ్యాయని అందులో అధికారులు కాపురం కూడా పెట్టేశారని లేఖ తయారు చేసి దానికి సాక్ష్యంగా.. తాము సీఆర్డీఏకు అద్దె చెల్లిస్తున్నామని… రూ. 63 కోట్లను జమ చేసి ఆ రిసీప్ట్ ను బ్యాంకులకు పంపించారు.
ఫేక్ పాలనలో బ్యాంక్ అధికారులూ భాగమే !
మామూలుగా చిన్న హోమ్ లోన్ ఇస్తే.. ఇల్లు ఏ స్థాయిలో ఉందో చూసి మాత్రమే తదుపరి వాయిదా లోన్ రిలీజ్ చేసే బ్యాంక్ అధికారులు.. ప్రభుత్వం ఇలా ఫేక్ కబుర్లు చెబితే వెంటనే నమ్మేసింది. అమరావతిలో నిర్మాణాలు పూర్తయ్యాయని.. వాటిలో జనం నివసిస్తున్నారని అంటే… ఓకే అనేశారు. ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది.
తప్పుడు విధానాలు – తప్పుల మీద తప్పులు
చేసింది తప్పుడు పరిపాలన. ఫేక్ పాలనతో ప్రజల్ని నట్టేట ముంచారు. అమరావతిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు అధికారులందర్నీ బలి చేసేలా. పేపర్ల మీద అమరావతి పూర్తయినట్లుగా కట్టుకథలు సృష్టిస్తున్నారు. ఇలాంటివి బయటకు వచ్చినవి కొన్నే.. బయటకు రావాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి.