పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంటాయని మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా అంటున్నారు. అయితే.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఈ పొత్తు వార్తలను తీవ్రంగా కొట్టి పడేస్తున్నారు. ఆరు నూరైనా కేసీఆర్ తో పొత్తు అనే మాటే ఉండదంటున్నారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని వీరిని ఆపేందుకే కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అంటున్నారు.
పొత్తులపై జరుగుతున్న ప్రచారం అంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని . సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారన్నారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందన్నారు.
అందుకే బీఆర్ఎస్ ఇన్ని స్కాంలు బయటపడుతున్న చర్యలు కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లన్నారు. గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని అంటున్నారు.