యువత జీవితాలను వాలంటీర్ల పేరుతో నిర్వీర్యం చేస్తున్న జగన్ రెడ్డి వారిని అరాచకశక్తులుగా మార్చేందుకు గట్టి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. చొక్కా మడత పెట్టాలని ఆయన ఇచ్చిన పిలుపు వెనుక చాలా పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడ్డాలన్న పిలుపు అందులో ఉందని అంటున్నారు. ఓటర్ను బెదిరదదించడం దగ్గర్నుంచి అన్ని రకాల అరాచకాలకు పాల్పడితే గుర్తింపు ఉంటుందని చెప్పే తర్వాత లీడర్లను చేస్తానని ఆయన ఆశ పెట్టినట్లుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ రెడ్డి పార్టీలో అరాచక శక్తులకే ప్రాధాన్యం ఇస్తారు. జేబు దొంగలు పదవుల్లోకి వస్తారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని చూస్తే అంతా అలాంటి బ్యాచే ఉంటారు. చివరికి విజయవాడ నగరంలో ఓ ప్రొఫెషనల్ పిక్ పాకెటర్ కార్పొరేటర్ గా ఉన్నారు. ఇటీవల ఆయన దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కూడా. అలాంటి వాళ్లు వైసీపీలో చాలా మంది ఉన్నారు. స్థానిక పదవుల్లో.. పార్టీ పదవుల్లో వారికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లను జగన్ అదే దారి పట్టించే ప్లాన్ లో ఉన్నా రు.
ఇప్పటికే ప్రతి యాభై కుటుంబాల గుట్టు వాలంటీర్ చేతిలో ఉంది. అతను చేయదల్చకుంటే ఏమైనా చేస్తాడని… కుటుంబాలను రోడ్డు మీద పడేస్తాడన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వాలంటీర్లకు శిక్ష కూడా ఇస్తున్నారు. మీరే నా సైన్యం అని ప్రకటించడం ద్వారా జగన్ రెడ్డి.. వారిని అరాచకశక్తులను చేసి.. బలి పశువుల్ని చేసి అయినా ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. ఆయన కోసం పని చేసి బలైపోయిన ఎంతో మంది ఇప్పుడు దిక్కు లేకుండా బలైపోయి ఉన్నారు.. ఆ జాబితాలో వాలంటీర్లు చేరుతారేమో చూడాల్సి ఉంది.