నారా లోకేష్ చేయాలి అనుకోవాలి కానీ.. స్మూత్ గా అన్ని పక్కాగా పూర్తయ్యేలా చేస్తారు. ఓడించారని మంగళగిరిపై ఆయన కక్ష పెంచుకోలేదు..ఇంకా ప్రేమ పెంచుకున్నారు. మంగళగిరిలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఉదాత్తమైన ఆలోచనలు చేశారు. అందులో ఒకటి వీవర్స్ సెంటర్. ఈ వీవర్స్ సెంటర్ ను నారా బ్రాహ్మణి మంగళగిరిలో ఈ రోజు ప్రారంభిస్తున్నారు. టాటా తనేరా సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వీవర్స్ రిసోర్స్ సెంటర్ చేనేతలకు అద్భుతమైన సహకారాన్ని అందించనుంది.
మంగళగిరి నియోజకవర్గంలో 30,000 మందికి పైగా చేనేత కార్మికులున్నారు. పర్యటనల సందర్భంలో చేనేత కార్మికులు, డై వర్కర్స్ తో లోకేశ్ మాట్లాడి వారి సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. పాలసీ మార్చితే సరిపోదని, సమూలంగా వ్యవస్థలో మార్పులు తేవాలని నిర్ణయించుకున్నారు. క్షేత్రస్థాయిలో చేనేతలతో మాట్లాడినవి, ఆయా రంగాల నిపుణులతో చర్చించినవి, మార్కెటింగ్ అవకాశాలు పరిశీలించినవి అన్నీ అధ్యయనం చేసిన తరువాత ఓ ప్రణాళిక రూపొందించారు. చేనేత కార్మికులు సాంప్రదాయ పద్ధతిలో రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. వీరికి కొత్త టెక్నాలజీ వాడడం నేర్పి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా 30 శాతం ఉత్పత్తి పెంచాలని ప్రణాళిక. దానికి తగ్గ శిక్షణ ఇస్తారు. హైస్పీడ్ చరఖా, రాక్ లూమ్స్, మెకానికల్ లిఫ్టర్స్ వంటివి కార్మికులు వాడటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు తక్కువ గంటల్లో ఎక్కువ ఉత్పత్తి సాధిస్తారు.
రోజుల కొద్దీ ఇంటిల్లిపాదీ కష్టపడి నేసిన చీరలు, వస్త్రాలు దళారుల చేతికి చిక్కుతున్నాయి. దీంతో లాభాలు రావడంలేదు. చేనేతల్ని దోచుకునే మధ్య దళారీలకి చెక్ పెట్టి నేరుగా తాము నేసిన చీరలు, వస్త్రాలు తామే అమ్ముకునేలా కొన్ని కార్పొరేట్ సంస్థలతో టై అప్ కుదిర్చారు. ప్రపంచంలో ఏ మూలనుంచైనా మంగళగిరి చీరలు, వస్త్రాలు ఆన్ లైన్లో ఆర్డర్ చేయొచ్చు. వచ్చే లాభం నేరుగా చేనేతలకే చేరుతుంది. చేనేత ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేర్చే వెబ్ సైట్ www.weaversdirect.in. లోకేశ్ తన బృందంతో అందుబాటులోకి తీసుకొచ్చారు.