తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించారు. మొత్తం బాధ్యత ఆయనే తీసుకున్నారు. తెలంగాణ భవన్ లో అంతా ఆయన ఖర్చే. ట్రై సైకిళ్లు, ఇన్సూరెన్స్ పత్రాలు వంటివి పంపిణీ చేశారు. ఇదంతా ఆయన కుమారుడికి లోక్ సభ టిక్కెట్ కోసం అని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. కుదిరితే మల్కాజిగిరి లేకపోతే సికింద్రాబా్ పై ఆయన కన్నేశారు.
మరో వైపు కేసీఆర్ ఇమేజ్ ను బాపు గా తీర్చిదిద్దేందుకు ఈ పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. కేసీఆర్ మూడో సారి గెలిచి ఉంటే.. ఆయనను ఖచ్చితంగా తెలంగాణ బాపుగా బ్రాండింగ్ వేసేసి ఉండేవారు. కానీ ఆయన ఓడిపోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రమే బాపుగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తోంది. ఉత్తర తెలంగాణలో తండ్రిని బాపు అని పిలుస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ జాతి పితగా కేసీఆర్ ను గుర్తుంచుకోవాలంటే బాపు అనే పిలుపు ఉండాలని బ్రాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే కేసీఆర్ పుట్టిన రోజు అంటే.. అధికారంలో ఉన్నప్పుడు ఊరూవాడా జరిగేది. కానీ ఈ రారి మాత్రం మొత్తం తెలంగాణ భవన్ కే పరిమితమియంది. ఇతర చోట్ల పెద్దగా బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేయలేదు. చాలా చోట్ల పార్టీ నేతలు ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఎఫెక్ట్ పుట్టిన రోజు వేడుకలపై పడింది. లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారు కాస్త యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.