జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలాఖరు వరకు ఎన్నికలసన్నాహాలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆ తరవాత వరుసగా ప్రచార భేరీ మోగించనున్నారు మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ సమీక్షలు చేయనున్నారు. ఆదివారం నుంచి విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. నిర్వహిస్తారు. తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్తారు.
టీడీపీ ఎన్డీఏలో చేరే ప్రకటన 21న ఉండే అవకాశం ఉంది. ఆ ప్రకటన తర్వాత రాయలసీమలో పవన్ పర్యటిస్తారు. తిరుపతిలో రాయలసీమకి సంబంధించిన నాయకులతో భేటీలు, సమీక్షలు నిర్వహిస్తారు. తరువాత ఒంగోలు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల భేటీలు, సమీక్షలు చేస్తారు. అన్ని ప్రాంతాల సమీక్షలు పూర్తయిన తర్వాత ఈనెల చివరి నుండి జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది.
పొత్తులపై ఎవరు పోటీ చేసినా.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జనసేన నేతలకు ఎలక్షనీరింగ్ లో అనుభవం లేదు. టీడీపీ నే అన్నీ చూసుకోవాలి., అందుకే పవన్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. టీడీపీ కూడా జనసేన పోటీ చేసే స్తానాల్లో ప్రత్యేక బాధ్యతలు తీసుకుంటుందని చెబుతున్నారు.