జగన్ రెడ్డి తన మేనిఫెస్టోను ఎలా అమలు చేశారో ప్రజలు చూశారు. 99.8 శాతం అమలు చేశామని ప్రచారం చేసుకుంటారు కానీ.. నిజానికి ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అనేక పథకాలకు అర్హుల పేరుతో.. చేసిన విన్యాసాలు అందరూ చూశారు. చివరికి పెళ్లిళ్లకు .. పదో తరగతికి లింక్ పెట్టి లక్షల మంది పేదలకు అన్యాయం చేశారు. రైతు భరోసా పేరుతో ఏకమొత్తంగా పన్నెండున్నర వేలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టి.. మూడు విడతలల్లో ఏడున్నర వేలు ఇస్తున్నారు. కేంద్రం జగన్ రెడ్డి అధికారంలోకి రాక ముందే ప్రవేశ పెట్టిన పథకం కింద ఇచ్చే ఆరు వేలు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ జనాలకు తెలియదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ రెడ్డి రుణమాఫీ హామీ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీ సంగతి తెలిసి వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలకు వెళ్తూ రుణమాఫీ చేస్తామని అంటే.. ట్రాక్ రికార్డు చూస్తారు కదా అంటున్నారు. రైతులకు సున్నా వడ్డీరుణాలను కూడ ఎగ్గొట్టిన చరిత్ర జగన్ రెడ్డికి ఉంది కదా అంటున్నారు. జగన్ రెడ్డి బటన్లు నొక్కడానికి అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ఆయన రైతుల పొలాల్ని అమ్మేసి.. వారికి భూమితో పాటు రుణం కూడా లేకుండా చేస్తారన్న సెటైర్లు పడుతున్నాయి.
సంపద సృష్టించకుండా.. దోపిడీ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. జీతాలుకూడా ఎప్పటికే ఇస్తున్నారు. వారం వారం మూడు, నాలుగు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పులు తేవాల్సి ఉంది. అప్పుల కోసం ఓ టీమ్ ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ అప్పుల కు తిరిగి చెల్లింపుల కోసం ప్రజలపై భారం మోపుతున్నారు. ఐదేళ్లలో మధ్యతరగతి జీవితాల ప్రజల జీవనాన్ని మరింత భారంగా మార్చారు. ఇప్పుడు కొత్త విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.