సిద్ధం పేరుతో బహిరంగసభలు అయినా డబ్బులు పడని బటన్లు నొక్కే ప్రోగ్రామైనా చివరికి… అసలు రాజకీయాలతో సంబంధం లేని ప్రైవేటు కార్యక్రమం అయినా జగన్ రెడ్డి స్పీచ్ అంతా ఒకటే. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తు రాదు.. చంద్రబాబు పధ్నాలుగేళ్లు సీఎంగా ఏమీ చేయలేదు.. అంటూ… చంద్రబాబు జపం చేస్తారు. తర్వాత పవన్ కల్యాణ్ మీద పడతారు .తర్వాత మీడియా పడతారు. చివరికి రాప్తాడులో దాదాపుగా వంద కోట్ల వరకూ ఖర్చు పెట్టి.. గుంటూరు జిల్లా నుంచి కూడా మూడు వేల బస్సుల్లో జనాల్ని తరలించి ఏర్పాటు చేసిన సభలోనూ అదే స్పీచ్ .
తాను బటన్లు నొక్కానని చెబుతారు తప్ప… మద్య నిషేదం దగ్గర నుంచి పోలవరం వరకూ తన చేతకాని తనం గురించి ప్రజల్లో ఉన్న సందేహాల గురించి ఒక్క మాట చెప్పరు. ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోయారో చెప్పరు. కానీ.. ఎదుటి వాళ్ల మీద మాత్రం.. పడి ఎడవడానికి తన సమయం అంతా కేటాయిస్తారు. చొక్కాలు మడత పెట్టాలంటూ.. గత సభలో జగన్ అంటే.. కుర్చీ మడతపెడతామని చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు కుర్చీని మడత పెట్టాలని జగన్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డికే కుర్చీ ఉందనే సంగతిని మర్చిపోయారు.
రాప్తాడు సభ మూడు సార్లు వాయిదా పడింది. చివరికి రెండు లక్షల మందితో సభను నిర్వహించి పది లక్షల మంది వచ్చారని ప్రచారం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మూడు వేల ఆర్టీసీ బస్సుల్ని ఏర్పాటు చేశారు. వాటికి డబ్బులు ఇచ్చారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. చివరికి గుంటూరు నుంచి కూడా బ స్సుల్లో జనాల్ని తరలించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడూ ఏడ్చే ఏడుపులోనూ కొత్త దనం ఉండటం లేదు. పైగా ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. చీకటి సమయంలో ఎవరైనా సభుల్ని సెల్ ఫోన్ లైట్లు వేసి … మద్దతు తెలుపాలంటారు. సెల్ ఫోన్ లైట్లు వేసినా తెలియని చిక్కటి వెలుతురు జగన్ రెడ్డి అదే విజ్ఞప్తి చేసి…అందర్నీ మొహాలు చూసుకునేలా చేశారు.