యాభై శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డబ్బుపై ఆశ లేదంటే నమ్మారు. అవినీతి చేయాల్సిన అవసరం లేదని.. తాను చేయను.. ఇతరుల్ని చేయనివ్వనంటే.. మారిన మనిషి అనుకున్నారు. ఒక్క చాన్స్ అని దీనంగా అడిగితే.. అందరూ ఓట్లు గుద్దారు. కానీ ఈ అభిమానాన్ని జగన్ రెడ్డి లనిలుపుకున్నారా ? వారి నమ్మకాన్ని కాపాడుకున్నారా ? అని విశ్లేషించుకుంటే… ఆయనను ఇప్పుడు ఏపీ ప్రజలు 30 శాతం మంది కూడా నమ్మడం లేదు. ఘోరమైన పరిపాలనతో ఐదేళ్లలో ప్రజావిశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయిన నేతగా జగన్ రెడ్డి ఇప్పుడు అందరి ఎదురుగా నిలబడ్డారు.
ఏపీ ప్రజల్లో జగన్ పాపులారిటి 30 శాతం కన్నా తక్కువ
మూడ్ ఆఫ్ ది నేషన పేరుతో ఇండియా టుడే విడుదల చేసిన పోల్లో ఏపీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. సొంత రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ పాపులారిటీ పూర్తిగా పడిపోయింది. బెస్ట్ సీఎంల జాబితాలో సీఎం జగన్ అసలు చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏపీ రాష్ట్రంలోని ఓటర్లతో నిర్వహించిన పోల్ లో సీఎం పని తీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో సీఎం జగన్కు చోటు దక్కలేదు. అసలు తాము నిర్ణయించుకున్న బెంచ్ మార్క్ వరకూ ఆయనకు ఆదరణ లేదని ఇండియాడు టుడే చెబుతోంది. మొదటి స్థానంలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఆయన 22 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు. స్టాలిన్ కూడా మంచి రేటింగ్ తెచ్చుకున్నారు. కానీ జగన్ రెడ్డికి మాత్రం ఇందులో చోటు లభించలేదు. 30 శాతం మంది అయినా పర్వాలేదు అని చెప్పిన వారికి జాబితాలో చోటు లభించింది. కానీ జగన్ రెడ్డి అంత కంటే దిగజారిపోయారు.
అసలు ఓ పది శాతం మందికి అయినా జగన్ పై నమ్మకం ఉందా ?
ఇండియా టుడే చెప్పలేదు కానీ.. జగన్ రెడ్డి గురించి ఏపీలో చేసిన సర్వేల్లో వాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసి ఉంటాయి. యాభై శాతం ఓట్లతో గెలిచిన లీడర్.. ఐదు అంటే ఐదు ఏళ్లలో నలభై శాతం మంది ఆదరణను కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. ఎంత ఘోరమైన పరిపాలన చేసి ఉండాలి.. ఎంత ఘోరంగా ప్రజల్ని నాశనం చేసి ఉండాలి..?. అంత కంటే ఘోరంగానే చేశారు. కానీ కులాలు, మతాల పేరుతో రాజకీయం చేస్తూ.. ఓట్లు అడుగుతున్నారు కాబట్టి ఆ పది .. పదిహేను శాతం మంది.. జగన్ పేరు చెప్పి ఉంటారు… అభివృద్ధి, సంక్షేమం,లా అండ్ ఆర్డర్ సహా ఏ విషయాలను చూసుకున్నా జగన్ రెడ్డికి సొంత వాళ్లు కూడా ఓట్లు వేయరు.
ప్రజల్ని తేలికగా తీసుకుంటే ఇంతే !
ఆ ప్రజలేగా.. ఓట్లను బెదిరించి వేసుకుంటాం.. కొనుక్కుంటాం.. లాంటి వెర్రి మొర్రి ఆలోచనలు పెట్టుకుని రాజకీయాలు చేస్తే… ఏ ఓటుతో అధికారంలోకి వచ్చారో అదే ఓటుతో వేటు వేస్తారు. చరిత్రలో జరిగింది ఇదే. ఎక్కడో కాదు.. చివరికి తెలంగాణలోనూ అదే జరిగింది. అక్కడి ప్రభుత్వం… జగన్ రెడ్డి సర్కార్ కన్నా మెరుగైన పాలనే చేసింది.కానీ ప్రజలు అధికార దుర్వినియోగాన్ని సహించలేక తిప్పికొట్టారు. ఏపీలో అతి ఎవరూ ఊహించనంత ఎక్కువగా తుడిచి పెట్టబోతున్నారు