ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికల్ని జనసేన మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. జనసేన తరపున నాగబాబు కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న విషయంలో మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో పవన్, నాగబాబు తరపున వరుణ్‌తేజ్ ప్రచారం చేస్తారా? ఆయన క్యాంపెనింగ్‌లో పాల్గొంటారా? అనే ఆసక్తి నెలకొంది. తెలుగు 360కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో దీనిపై వరుణ్ స్పందించారు.
”ఏమో… ఇప్పటి వరకూ ఏం అనుకోలేదు. బాబాయ్ ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నా” అని చెప్పుకొచ్చాడు. ఇన్ సైడ్ వర్గాలు మాత్రం ఈసారి వరుణ్‌తేజ్ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తారని గట్టిగా చెబుతున్నారు. వరుణ్‌తో పాటుగా సాయిధరమ్ తేజ్ కూడా ఈసారి ఎన్నికల క్యాంపెయినింగ్ లో కనిపించే ఛాన్సుంది. అంజనా ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ‘ఆరెంజ్’ తరవాత ఆ బ్యానర్ నుంచి సినిమా ఏం రాలేదు. దాన్ని వరుణ్ టేకప్ చేస్తాడని ప్రచారం జరిగింది. దీనిపై వరుణ్ మాట్లాడుతూ ”నేను ప్రస్తుతం నా కెరీర్ పై ఫోకస్ చేస్తున్నా. ముందు హీరోగా నిలబడాలి. మరిన్ని హిట్లు కొట్టాలి. ఆ తరవాతే.. మిగిలిన విషయాలు ఆలోచిస్తా” అంటున్నాడు.