ఈ యేడాది విడుదల అవుతున్న క్రేజీ ప్రాజెక్టులలో ‘పుష్ష 2’ ఒకటి. ఆగస్టు 15న ‘పుష్ష 2’ని విడుదల చేయడం కోసం చిత్రబృందం రేయింబవళ్లూ కష్టపడుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఇంట్రవెల్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టులు, ప్రధాన తారాగణం ఈ షూటింగ్ లో పాలు పంచుకొంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన ఇంట్రవెల్ బ్యాంగ్ ఇది. పాట, ఫైట్.. ఎమోషన్ సీన్స్… ఇలా అన్నీ మేళవించి, ఈ ఎపిసోడ్ ని తీర్చిదిద్దుతున్నట్టు టాక్. ఇంట్రవెల్ బ్యాంగ్ ఈ సినిమాని ఓ రేంజ్లో తీసుకెళ్లి కూర్చోబెట్టబోతోందని, ఈ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ విదేశాల్లో ఉన్నాడు. ఈలోగా తను లేని షాట్స్ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో జగదీష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పుష్షలో.. కేశవగా జగదీష్ ఆకట్టుకొన్నాడు. అయితే ఓ కేసు నిమిత్తం జగదీష్ అరెస్ట్ అయ్యాడు. తను లేకుండా ఈ సినిమా షూటింగ్ ముందుకెళా వెళ్తుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఇప్పుడు తను బెయిల్ లో బయటకు వచ్చాడు. ఈ జాతర ఎపిసోడ్లో తాను కూడా భాగం పంచుకొంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.